జలదిగ్బంధంలో బిక్కుబిక్కుమంటూ...

ABN , First Publish Date - 2020-10-18T14:28:57+05:30 IST

ప్రగతినగర్‌లో ఇంకాయిస్‌ చౌరస్తా, అలీప్‌ ఎగువ ప్రాంతాల్లోని సెల్లార్లలోకి చేరిన వాన నీటిని మోటర్ల ద్వారా బయటికి వదలడంతో డ్రైనేజీలు నిండి ప్రధాన రహదారులపై మురుగు ప్రవహిస్తోంది.

జలదిగ్బంధంలో  బిక్కుబిక్కుమంటూ...

ముంపు ప్రాంతాల వాసులు ఐదు రోజులుగా ఇళ్లల్లోనే బందిఖానాగా గడుపుతున్నారు. బయటి ప్రపంచంతో సంబంధాలు కట్‌ అయినట్లుగా బతుకుతున్నారు. కాలనీ, బస్తీ నిండా నీటితో రాకపోకలు  బంద్‌ అయ్యాయి. తడిసిన దుస్తులు, దుప్పట్లు. చల్లటి గాలుల నుంచి కాపాడుకునే పరిస్థితి కూడా లేదు. ఆహార పదార్థాలు నీళ్లపాలవడంతో వండుకునే అవకాశం లేదు. అన్ని రకాలుగానూ ఇబ్బందిగా బతుకీడుస్తున్నారు.


హైదరాబాద్ : ప్రగతినగర్‌లో ఇంకాయిస్‌ చౌరస్తా, అలీప్‌ ఎగువ ప్రాంతాల్లోని సెల్లార్లలోకి చేరిన వాన నీటిని మోటర్ల ద్వారా బయటికి వదలడంతో డ్రైనేజీలు నిండి ప్రధాన రహదారులపై మురుగు ప్రవహిస్తోంది.

బండ్లగూడ చెరువు నిండటంతో నాగోల్‌ డివిజన్‌లోని అయ్యప్ప కాలనీలోకి వరద నీరు చేరింది. సుమారు 100 ఇళ్లలోకి నీరు చేరింది. ప్రజలు ఐదు రోజులుగా ఇళ్లలోనే బందీలుగా ఉండిపోయారు. 

శ్రీనివాస కాలనీ పరిధిలోని సుమారు 50 ఇళ్ల ముందు వరద నీరు చేరడంతో ప్రజలు బయటికి రాలేని పరిస్థితి.

నాగోలు చెరువు అలుగు పారుతుండటంతో వెంకటరమణ కాలనీ మీదుగా భారీగా వరద నీరు మూసీలోకి వెళ్తోంది. నాగోలు నుంచి జైపు రి కాలనీ వైపు రాకపోకలు బంద్‌  అయ్యాయి. 

హయత్‌నగర్‌ డివిజన్‌ బంజారాకాలనీలో ఇళ్లన్నీ నీట మునిగాయి. రెండు చెరువులు అలుగు పోస్తుండడంతో నీరు ప్రవహిస్తూనే ఉంది. 

కుమ్మరికుంట చెరువు ఎఫ్‌టీఎల్‌లోనే పద్మావతి కాలనీ ఉండడంతో పూర్తిగా మునిగింది. 

వరద, బురదతో అలీనగర్‌ పరిస్థితి ఇప్పటికీ భయంకరంగానే ఉంది. 

కొంపల్లి మున్సిపాల్టీలోని ఉమామహేశ్వర్‌ కాలనీలో నీటి ప్రవాహం తగ్గకపోవడంతో స్థానికులు మల్టీపర్పస్‌ ఫంక్షన్‌ హాల్‌లోనే పునరావాసం పొందుతున్నారు. ఫాక్స్‌ చెరువులో నీటి మట్టం పెరుగుతుండడంతో జనం భయపడుతున్నారు. 

రంగారెడ్డినగర్‌ ప్రధాన రహదారి మురుగునీరు, చెత్తాచెదారంతో అధ్వానంగా ఉంది. ఫ మియాపూర్‌, మదీనగూడ, చందానగర్‌, తారానగర్‌, కొండాపూర్‌, హఫీజ్‌పేట, రాయదుర్గం, శేరిలింగంపల్లి, గచ్చిబౌలిలోని పలు ప్రాంతాల్లో రహదారులు కొట్టుకుపోయాయి. 

Updated Date - 2020-10-18T14:28:57+05:30 IST