Abn logo
Sep 23 2021 @ 12:13PM

హైదరాబాద్ వాసికి ఉత్తమ వ్యాపారవేత్త అవార్డు

హైదరాబాద్: నగరవాసికి ఉత్తమ వ్యాపారవేత్త అవార్డు దక్కింది. హైదరాబాద్‌కు చెందిన ప్రైమార్క్ గార్మెంట్స్ అధినేత అరుణ్ కుమార్‌కు మైక్రో, స్మాల్ ఎంటర్ ప్రైజెస్(ఎంఎస్ఎంఈ) ఉత్తమ వ్యాపారవేత్త 2021 అవార్డు లభించింది. వర్చువల్‌గా జరిగిన ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ అసిస్టంట్ డైరెక్టర్ సుమతి ఈ అవార్డును ప్రకటిచారు. గార్మెంట్స్ విభాగంలో అరుణ్ తన దైన శైలిలో ముందుకు దూసుకెళుతూ, ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు. గత సంవత్సరం కూడా తెలంగాణా ఐటీశాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా అవార్డును అందుకోవడం విశేషం.

హైదరాబాద్మరిన్ని...