Abn logo
Jul 10 2021 @ 14:05PM

Hyderabad బాలికకు సోనూసూద్‌తో నటించే చాన్స్‌

హైదరాబాద్/నార్సింగ్‌ : మణికొండకు చెందిన బాలికకు నటుడు సోనూసూద్‌తో కలిసి నటించే అవకాశం లభించింది. సోనూసూద్‌ ఓ స్పోర్ట్స్‌ యాడ్‌ సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం సికింద్రాబాద్‌ ఆర్‌ఆర్‌సీ బ్యాడ్మింటన్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్న కె. సమీక్షారెడ్డి (12)ని ఎంపిక చేసుకున్నారు. ఆమె బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణిగా, కోచ్‌గా సోనూ ఆ యాడ్‌లో కనిపించనున్నారు. ఎల్బీస్టేడియంలో ఇందుకోసం శుక్రవారం షూటింగ్‌ నిర్వహించారు. ఈ యాడ్‌ ద్వారా వచ్చే డబ్బులో కొంత సోనుసూద్‌ చారిటీకి, మరికొంత ఆర్‌ఆర్‌సీలో శిక్షణ పొందే పేద క్రీడాకారులకు ఇవ్వనున్నట్లు బాలిక తండ్రి మధుసూదన్‌రెడ్డి తెలిపారు. 

హైదరాబాద్మరిన్ని...