Advertisement
Advertisement
Abn logo
Advertisement

అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్‌

22 ద్విచక్ర వాహనాలు, బంగారు ఆభరణాలు స్వాధీనం

హైదరాబాద్/గుర్రంపోడు: జల్సాలకు అలవాటుపడి వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట దొంగను నల్లగొండ జిల్లా గుర్రంపోడు పోలీసులు మంగళవారం అరెస్టు  చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను దేవరకొండ డీఎస్పీ ఆనంద్‌రెడ్డి విలేకరులకు తెలిపారు. గుర్రంపోడు మండలం మైలపురం గ్రామానికి చెందిన పచ్చ గట్టారెడ్డి హైదరాబాద్‌లోని హస్తినాపురంలో నివాసం ఉంటూ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. జల్సాలకు అలవాటు పడి సంపాదన సరిపోకపోవడంతో దొంగతనాలకు పాల్పడటం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే 2017 నుంచి 2019వరకు ఎల్‌బీనగర్‌, జీడిమెట్ల ప్రాంతాల్లో పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డాడు. అప్పట్లో ఎల్‌బీనగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు పంపించారు. జైలునుంచి తిరిగి వచ్చిన అనంతరం కొద్ది నెలల క్రితం సోదరుడు విజయవర్దన్‌రెడ్డితో గొడవలు కావడంతో పిట్టలగూడెం గ్రామంలోని తన సోదరి ఇంట్లో కొంత కాలంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో జల్సాలకు డబ్బులు లేకపోవడంతో ద్విచక్రవాహనాలకు నకిలీ తాళాలను తయారు చేసి గుర్రంపోడు మండలంలో పలు వాహనాలను చోరీ చేశాడు. మంగళవారం గుర్రంపోడు ఎస్‌ఐ రవి ఆధ్వర్యంలో పిట్టలగూడెం స్టేజీ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో గంటారెడ్డి బైక్‌పై వెళ్తుండగా పోలీసులు ఆపే ప్రయత్నం చేయడంతో అతను వాహనాన్ని ఆపకుండా వేగంగా పారిపోయేందుకు యత్నించాడు. దీంతో పోలీసులు అతడిని వెంబడించి పట్టుకుని వాహన పత్రా లు చూపాలని అడగటంతో సరైన సమాధానం చెప్పలేదు. అనంతరం అదుపులోకి తీసుకుని స్టేషన్‌లో విచారించగా గతంలో తాను చేసిన దొంగతనాల గురించి అంగీకరించారు. అపహరించిన బైకులు పిట్టలగూడెంలోని తన బావ మారెడ్డి రాంరెడ్డి బత్తాయితోటలో దాచినట్టు తెలపడంతో అక్కడికి వెళ్లి 22 ద్విచక్ర వాహనాలను నిందితుడి నుంచి రూ.20లక్షల విలువైన బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. 


రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని మేడిపల్లి, ఇబ్రహీంపట్నం, ఏపీలోని గుంటూ రు, మాచర్ల, నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, దేవరకొండ, కనగల్‌, గుర్రంపోడు, చింతపల్లి, నాగార్జునసాగర్‌, పోలీస్‌ స్టేషన్‌పరిధిలో ద్విచక్రవాహనాలను అపహరించినట్లు నిందితుడు తెలిపాడు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ గట్టారెడ్డిపై వివిధ సెక్షన్లతో పాటు పీడీ యాక్ట్‌ కేసు నమోదు చేశామని తెలిపారు.  

Advertisement
Advertisement