ఉద్యోగాల పేరుతో కోట్లు కొట్టేసి లారీలు కొన్న హెడ్ కానిస్టేబుల్
ABN , First Publish Date - 2021-10-13T02:46:19+05:30 IST
ఉద్యోగాల పేరుతో హెడ్ కానిస్టేబుల్ షేక్షావలి కోటి 68 లక్షల రూపాయలు కాజేశారు. హైదరాబాద్ చీఫ్ సెక్యూరిటీ వింగ్‌లో ..
హైదరాబాద్: ఉద్యోగాల పేరుతో హెడ్ కానిస్టేబుల్ షేక్షావలి కోటి 68 లక్షల రూపాయలు కాజేశారు. హైదరాబాద్ చీఫ్ సెక్యూరిటీ వింగ్‌లో కానిస్టేబుల్ షేక్షావలి పని చేస్తున్నారు. ముఖ్యమంత్రులతో దిగిన ఫొటోలను ఆసరాగా చూపించి ఉద్యోగాల పేరుతో వల వేశారు. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తా అని లక్షలు వసూలు చేశారు. షేక్షావలిపై సైబరాబాద్‌లో పలు పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదు చేశారు. అమాయక ప్రజలను ఉద్యోగాల పేరుతో మోసం చేస్తూ వచ్చిన డబ్బుతో హెడ్ కానిస్టేబుల్ షెకావలి 4 లారీలు కొన్నారు. ఫ్లాట్ కోసం బ్యాంక్‌లో లోన్ కొరకు నకిలీ అడిషనల్ ఎస్పీ ఐడీ కార్డుతో మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. హెడ్ కానిస్టేబుల్ షేక్షవలిను నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.