Abn logo
Sep 20 2021 @ 18:41PM

హైదరాబాద్‌‌కు భారీ వర్ష సూచన

హైదరాబాద్: వర్షం నేపథ్యంలో నగర వాసులకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు ప్రాంతాల్లో కారుమబ్బులు కమ్ముకోవడంతో భారీ వర్షం పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వర్షం తాకిడి బీభత్సంగా ఉంటుందని పేర్కొన్నారు. పాతబస్తీలో వర్షం ప్రారంభమైంది. చార్మినార్ ప్రాంతంతో పాటు మదీనా, బహదూర్‌పురాలో వాన పడుతోంది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని వాతావరణ అధికారులు ప్రకటించారు. బయట ఉన్న వారు వెంటనే ఇళ్లకు, సురక్షితంగా వెళ్లాలని సూచించారు. 


ఇవి కూడా చదవండిImage Caption