బలమైన స్టార్టప్‌ వ్యవస్థ ఇక్కడే

ABN , First Publish Date - 2020-07-12T06:17:24+05:30 IST

స్టార్ట్‌పల వ్యవస్థపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. అతిపెద్ద స్టార్టప్‌ ఇంక్యుబేటర్‌ టీ-హబ్‌ మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం ‘వియ్‌ హబ్‌’, వినూత్న ఉత్పత్తుల అభివృద్ధి కోసం టీ-వర్క్స్‌ను ఏర్పాటు చేసిందని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు...

బలమైన స్టార్టప్‌ వ్యవస్థ ఇక్కడే

  • హైదరాబాద్‌లో సీఐఐ ఇన్నోవేషన్‌ కేంద్రం 


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): స్టార్ట్‌పల వ్యవస్థపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. అతిపెద్ద స్టార్టప్‌ ఇంక్యుబేటర్‌ టీ-హబ్‌ మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం ‘వియ్‌ హబ్‌’, వినూత్న ఉత్పత్తుల అభివృద్ధి కోసం టీ-వర్క్స్‌ను ఏర్పాటు చేసిందని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. పర్యావరణ అనుకూల టెక్నాలజీల కోసం శానిటేషన్‌ హబ్‌ (ఎస్‌ హబ్‌), బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ అభివృద్ధికి బ్లాక్‌ చెయిన్‌ యాక్సిలరేటర్‌ టీ-బ్లాక్‌ ఉన్నాయని, రా ష్ట్రంలో స్టార్ట్‌పల వ్యవస్థ వృద్ధికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఇవే నిదర్శనమని పేర్కొన్నారు. ఇన్నోవేషన్‌, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌, స్టార్ట్‌పల కోసం భారత పరిశ్రమ ల సమాఖ్య (సీఐఐ) ఏర్పాటు చేసిన కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడారు. రెండు వర్గాలకు ప్రయోజనం చేకూరే భాగస్వామ్యాల ద్వారా సీఐఐలో సభ్య త్వం ఉన్న 3,00,000 కంపెనీలతో స్టార్ట్‌పలు అనుసంధానం కావడానికి ఈ కేంద్రం దోహదం చేస్తుంది. ఒక ఉత్పత్తి ల్యాబ్‌ నుంచి మార్కెట్‌కు చేరే వరకూ కృషి చేస్తుంది.


స్టార్ట్‌పలకు లీడర్‌షిప్‌ మెలుకువలు, విధానపరమైన సూచనలు చేయడానికి వేదికగా ఉంటుంది. డీప్‌ టెక్‌ స్టార్టప్‌లపై సీఐఐ కేంద్రం దృష్టి పెడుతుంది. టీ-హబ్‌లో ప్రత్యేక స్థలాన్ని కేటాయించడం ద్వారా తెలంగాణ ఈ కేంద్రానికి మద్దతిచ్చింది. స్టార్ట్‌పలు కార్పొరేట్‌ కంపెనీలతో కలిసి పని చేసే అవకాశాన్ని కల్పించడం ఈ కేంద్రం ప్రధాన ఉద్దేశం. 


Updated Date - 2020-07-12T06:17:24+05:30 IST