డేటా సెంటర్ల కేంద్రంగా హైదరాబాద్‌

ABN , First Publish Date - 2021-06-17T09:03:53+05:30 IST

హైదరాబాద్‌ డేటా సెంటర్లకు కేంద్రంగా మారుతోంది. ప్రభుత్వం అనుసరిస్తున్న అనుకూల విధానం, ప్రోత్సాహకాలు, నిర్మాణ వ్యయాలు తక్కువగా ఉండడం, డేటా సెంటర్ల వినియోగానికి ఇక్కడ తగిన

డేటా సెంటర్ల కేంద్రంగా హైదరాబాద్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌ డేటా సెంటర్లకు కేంద్రంగా మారుతోంది. ప్రభుత్వం అనుసరిస్తున్న అనుకూల విధానం, ప్రోత్సాహకాలు, నిర్మాణ వ్యయాలు తక్కువగా ఉండడం, డేటా సెంటర్ల వినియోగానికి ఇక్కడ తగిన మార్కెట్‌ ఉండడం మొదలైన సానుకూల అంశాలు డేటా సెంటర్ల కేంద్రంగా హైదరాబాద్‌ అభివృద్ధి చెందడానికి దోహదం చేస్తున్నాయని జేఎల్‌ఎల్‌ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ అధిపతి సందీప్‌ పట్నాయక్‌ తెలిపారు. హైదరాబాద్‌ డేటా సెంటర్ల సామర్థ్యం ప్రస్తుతమున్న 30 మెగావాట్ల నుంచి 96 మెగావాట్లకు చేరగలదని డేటా సెంటర్లపై విడుదల చేసిన నివేదకలో జేఎల్‌ఎల్‌ వెల్లడించింది. డేటా సెంటర్ల సామర్థ్యాన్ని అవి వినియోగించే విద్యుత్‌ ఆధారంగా చెబుతారు. దేశంలోని డేటా సెంటర్ల సామర్థ్యం (థర్డ్‌పార్టీకి అద్దెకు ఇచ్చే)లో ప్రస్తుతం 7 శాతం వాటా హైదరాబాద్‌ లో ఉంది. 2023 నాటికి ఇది 10 శాతానికి చేరగలదని జేఎల్‌ఎల్‌ అంచనా వేస్తోంది. 

Updated Date - 2021-06-17T09:03:53+05:30 IST