రోడ్డుపై కళ్లు

ABN , First Publish Date - 2021-06-18T15:51:27+05:30 IST

జగద్గిరిగుట్ట రాజీవ్‌గృహ కల్పలో అదనపు గదుల నిర్మాణాల ముసుగులో ప్రభుత్వ స్థలాల కబ్జా కొనసాగుతోంది. ఆక్రమణలను అడ్డుకోవడంలో జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, హౌజింగ్‌ బోర్డు

రోడ్డుపై కళ్లు

జగద్గిరిగుట్ట రాజీవ్‌ గృహకల్పలో ప్రభుత్వ స్థలంలో గదులు  

రెండు బ్లాక్‌ల ప్రజలు బాహాబాహీ


హైదరాబాద్/జీడిమెట్ల: జగద్గిరిగుట్ట రాజీవ్‌గృహ కల్పలో అదనపు గదుల నిర్మాణాల ముసుగులో ప్రభుత్వ స్థలాల కబ్జా కొనసాగుతోంది. ఆక్రమణలను అడ్డుకోవడంలో జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, హౌజింగ్‌ బోర్డు అధికారులు విఫలం కావడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. సంక్షేమ సంఘాల ముసుగులో, కొందరు స్థానిక ప్రజా ప్రతినిధుల కనుసన్నల్లో ఈ కబ్జాతంతంగం జరుగుతోంది. తాజాగా బ్లాక్‌ నెంబర్‌ 43 వద్ద ఏకంగా సీసీ రోడ్డును తవ్వి అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో పక్క బ్లాక్‌ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కొందరు ప్రజాప్రతినిధులకు, అధికారులకు ముడుపులు ముట్టడంతో ఇక్కడ కబ్జాలు జోరుగా సాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. 

సంజయ్‌గాంధీనగర్‌లో కేవలం 40 గజాల్లో చేపట్టిన నిర్మాణాన్ని అనుమతులు లేవని కూల్చివేసిన గాజుల రామారం కమిషనర్‌కు జగద్గిరిగుట్టలో విచ్చలవిడిగా సాగుతున్న అక్రమ నిర్మాణాలు కనపించడం లేదా స్థానికులు అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రాజీవ్‌ గృహ కల్పలో అదనపు గదుల ముసుగులో సాగుతున్న కబ్జాలను అరికట్టాలని కోరుతున్నారు.

Updated Date - 2021-06-18T15:51:27+05:30 IST