HYD: పోలీసులను చూసి దొంగ పరారీ

ABN , First Publish Date - 2022-01-21T17:23:32+05:30 IST

దొంగిలించిన ద్విచక్రవాహనంపై దర్జాగా తిరుగుతున్న ఓ దొంగ ట్రాఫిక్‌ పోలీసుల తనిఖీలు చూసి వాహనం వదిలేసి పారిపోయాడు

HYD: పోలీసులను చూసి దొంగ పరారీ

పత్రాలు పరిశీలించి వాహనం యజమానికి అప్పగింత

హైదరాబాద్/మంగళ్‌హాట్‌: దొంగిలించిన ద్విచక్రవాహనంపై దర్జాగా తిరుగుతున్న ఓ దొంగ ట్రాఫిక్‌ పోలీసుల తనిఖీలు చూసి వాహనం వదిలేసి పారిపోయాడు. వాహనంలోని పత్రాలను పరిశీలించిన పోలీసులు యజమానికి వాహనాన్ని అందజేశారు. సుల్తాన్‌బజార్‌ ట్రాఫిక్‌ ఎస్‌ఐ ప్రసాద్‌, ఏఎ్‌సఐ సదత్‌ మియా సిబ్బందితో కలిసి ఈ నెల 17న అఫ్జల్‌గంజ్‌ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో టీఎస్‌ 08 హెచ్‌టీ 4481 నంబర్‌ గల ద్విచక్రవాహనంపై అటుగా వస్తున్న వాహనదారుడు వారిని చూసి వాహనాన్ని వదిలేసి పారిపోయాడు. పోలీసులు వాహనాన్ని సుల్తాన్‌బజార్‌ స్టేషన్‌కు తరలించారు.


అందులోని పత్రాలను పరిశీలించి యజమానికి ఫోన్‌ చేసి స్టేషన్‌కు రావాలని సూచించారు. వాహన యజమాని వాహద్‌ నవాజ్‌ఖాన్‌ ట్రాఫిక్‌ పోలీసులను కలిసి గతంలో తన వాహనం పోయిందని, పంజాగుట్ట పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశాని చెప్పాడు. పంజాగుట్ట పోలీ్‌సస్టేషన్‌ సిబ్బందితో మాట్లాడిన సుల్తాన్‌బజార్‌ ట్రాఫిక్‌ పోలీసులు ద్విచక్రవాహనాన్ని వాహద్‌ నవాజ్‌ఖాన్‌కు గురువారం అప్పగించారు. ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ సుమన్‌కుమార్‌, ఎస్‌ఐ ప్రసాద్‌, ఏఎ్‌సఐ సదత్‌ మియాకు నవాజ్‌ఖాన్‌ కృతజ్ఞతలు తెలిపారు. 

Updated Date - 2022-01-21T17:23:32+05:30 IST