Abn logo
Sep 23 2021 @ 12:47PM

జూబ్లీహిల్స్ వన్ డ్రైవ్ కేసులో కీలక మలుపు

హైదరాబాద్: జూబ్లీహిల్స్ వన్ డ్రైవ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. వన్ డ్రైవ్‌లో పనిచేస్తున్న మైనర్ బెనర్జీని పోలీసులు అరెస్ట్ చేశారు. బాత్‌రూంలో సెల్‌ఫోన్ చూసి యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాత్‌రూంలో సెల్‌ఫోన్ ద్వారా బెనర్జీ వీడియోలను చిత్రీకరించాడు. రెండ్రోజుల క్రితం కొత్త సెల్‌ఫోన్ కొన్న బెనర్జీ... సెల్‌ఫోన్ తీసుకెళ్లి లేడీస్ బాత్‌రూంలో పెట్టి రికార్డ్ చేశాడు. నాలుగున్నర గంటలపాటు బాత్‌రూం దృశ్యాలను బెనర్జీ చిత్రీకరించాడు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వన్ డ్రైవ్‌లో పనిచేస్తున్న హౌస్ కీపర్ బెనర్జీని అదుపులోకి తీసుకున్నారు. బెనర్జీతో పాటు వన్ డ్రైవ్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. వన్ డ్రైవ్ వ్యవహారంపై  యువతులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. వీడియోలు బయటకు రాకుండా చూడాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. వన్‌ డ్రైవ్‌ యజమాని చైతన్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఇవి కూడా చదవండిImage Caption

హైదరాబాద్మరిన్ని...