Abn logo
Oct 13 2021 @ 10:30AM

Hyderabad: గోషామహల్‌లో TRSకు మరింత బలం

హైదరాబాద్/అఫ్జల్‌గంజ్‌: గోషామహల్‌ నియోజకవర్గంలోని ఆరు డివిజన్లకు సమర్థవంతమైన నాయకులను నియమించడంతో టీఆర్‌ఎస్‌ బలం మరింత పెరిగిందని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్‌ రాథోడ్‌ అన్నారు. ఈ మేరకు మంగళవారం అఫ్జల్‌గంజ్‌లోని రాంనాథ్‌ ఆశ్రమం వద్ద ఉన్న పార్టీ కార్యాలయంలో దత్తాత్రేయనగర్‌ డివిజన్‌ అధ్యక్షుడు మహ్మద్‌ తహేర్‌ హుస్సేన్‌, మంగళహట్‌ డివిజన్‌ అధ్యక్షుడు శశిరాజ్‌ సింగ్‌, గోషామహల్‌ డివిజన్‌ అధ్యక్షుడు రాజేశ్‌ సింగ్‌, బేగంబజార్‌ డివిజన్‌ అధ్యక్షుడు సునీల్‌ సాహు, జాంబాగ్‌ డివిజన్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌ గౌడ్‌, గన్‌ఫౌండ్రి డివిజన్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌ యాదవ్‌ను రాథోడ్‌ చేతుల మీదుగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రేమ్‌సింగ్‌ రాథోడ్‌ మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన డివిజన్‌ అధ్యక్షులు ప్రతి బస్తీ, వాడకు ప్రభుత్వ పథకాలు అందించడానికి, సమస్యలు పరిష్కరించడానికి కృషి చేయాలని కోరారు. 

ఇవి కూడా చదవండిImage Caption

హైదరాబాద్మరిన్ని...