HYD: పాతబస్తీలో నవవధువు మృతి

ABN , First Publish Date - 2021-11-27T13:13:02+05:30 IST

పాతబస్తీ రెయిన్ బజార్‎లో నవ వధువు షఫియా ఫాతిమా (21) అనుమానస్పదంగా మృతి చెందింది. పాతబస్తీకి చెందిన రషీద్‌ 27 రోజుల క్రితం ఫాతిమాను పెళ్లి చేసుకున్నాడు. వివాహం అయిన 27 రోజులకే అత్తవారి ఇంట్లోనే అనుమానాస్పదంగా

HYD: పాతబస్తీలో నవవధువు మృతి

హైదరాబాద్: పాతబస్తీ రెయిన్ బజార్‎లో నవ వధువు షఫియా ఫాతిమా (21) అనుమానస్పదంగా మృతి చెందింది. పాతబస్తీకి చెందిన రషీద్‌ 27 రోజుల క్రితం ఫాతిమాను పెళ్లి చేసుకున్నాడు. వివాహం అయిన 27 రోజులకే అత్తవారి ఇంట్లోనే అనుమానాస్పదంగా షఫియా మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. వివాహిత మృతిపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకుని ఇంట్లో మృతదేహాన్ని గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. అనంతరం భర్త రషీద్‎ను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

Updated Date - 2021-11-27T13:13:02+05:30 IST