Abn logo
Sep 24 2021 @ 10:30AM

HYD: మైనర్‌పై లైంగిక వేధింపులు

హైదరాబాద్/పహాడీషరీఫ్‌: కిరాణ షాపులో పనిచేసే బాలికను ప్రేమ పేరుతో వేధించడమే గాకుండా, పెళ్లి చేసుకోకపోతే ఆమెపై చెడు ప్రచారం చేస్తానని బెదిరిస్తున్న ఒకరిపై పోలీసులు పొక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పహాడీ షరీఫ్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జల్‌పల్లికి చెందిన వ్యక్తి కిరాణ దుకాణాన్ని నడుపుతున్నాడు. బాలిక (15) కొంత కాలంగా ఆ దుకాణంలో పని చేస్తోంది. దుకాణ యజమాని ఆరు నెలలుగా బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. పెళ్లి చేసుకోకపోతే ఆమె గురించి చెడు ప్రచారం చేస్తానంటూ బెదిరిస్తున్నాడు. రోజురోజుకు వేధింపులు అధికం కావడంతో బాలిక విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. వారితో కలిసి పహాడీషరీఫ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

హైదరాబాద్మరిన్ని...