సింగరేణి కాలనీ చిన్నారి హత్య నిందితుల కోసం గాలింపు

ABN , First Publish Date - 2021-09-14T01:37:41+05:30 IST

సింగరేణి కాలనీ చిన్నారి హత్య నిందితుల కోసం గాలింపు

సింగరేణి కాలనీ చిన్నారి హత్య నిందితుల కోసం గాలింపు

హైదరాబాద్: సింగరేణి కాలనీ చిన్నారి హత్య కేసు నిందితుడు ఇంకా దొరకలేదు. పది బృందాలతో నిందితుడు రాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు. హైదరాబాద్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నిందితుడి ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. నిందితుడి 2 చేతులపై మౌనిక అని రాసి ఉంటుందని తెలిపారు. నిందితుడు రాజు పెద్ద జుట్టుకు రిబ్బన్ వేసుకొని తిరుగుతున్నాడని పేర్కొన్నారు. పాప హత్య తర్వాత యాదాద్రి జిల్లాకు పారిపోయినట్లు గుర్తించారు. 

Updated Date - 2021-09-14T01:37:41+05:30 IST