Abn logo
Sep 19 2021 @ 10:23AM

HYD: ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై కారు దగ్ధం..వ్యక్తి సజీవదహనం

హైదరాబాద్/శంషాబాద్‌: ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై షార్ట్‌ సర్క్యూట్‌తో ఓ కారు దగ్ధం అయింది. డీసీపీ ప్రకా్‌షరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... ఏపీ27 సీసీ 0206 కారు శనివారం రాత్రి 7.09 గంటలకు నానక్‌రామ్‌గూడ నుంచి హయత్‌నగర్‌ వైపు వెళ్తుండగా మార్గమధ్యలో మండల పరిధిలోని హమీదుల్లానగర్‌ వద్ద ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారులో ఉన్న వ్యక్తి సజీవదహనం అయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఫైర్‌ ఇంజన్లతో మంటలు ఆర్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని  పోలీసులు తెలిపారు. కారులో ఒక్కరు ఉన్నారా? లేక ఎంత మంది ఉన్నారు అనే విషయాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

హైదరాబాద్మరిన్ని...