Advertisement
Advertisement
Abn logo
Advertisement

Tank Bund : సండే ఫన్‌డే.. సందర్శకులను అలరించేందుకు ప్రత్యేకంగా ఈసారి..!

  • అలరించనున్న ట్యాంక్‌బండ్‌ సండే ఫన్‌డే
  • నేడు వస్త్ర ప్రదర్శన, తందూరి చాయ్‌

హైదరాబాద్‌ సిటీ : భాగ్యనగరవాసులు సెలవు రోజున కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపేందుకు ట్యాంక్‌బండ్‌పై నిర్వహిస్తున్న సండే ఫన్‌డే సరికొత్తగా ఉండనుంది. నేడు(ఆదివారం) సాయంత్రం ట్యాంక్‌బండ్‌ పొడవునా విద్యుత్‌ దీపాల వెలుగులు, పోలీస్‌ బ్యాండ్‌ వాయిద్యం, వివిధ వేషధారణలతో ఆకట్టుకోనున్నారు. దీంతోపాటు ఉచితంగా మొక్కల పంపిణీ, హ్యాండీ క్రాఫ్ట్‌, వస్త్ర ప్రదర్శన చేపట్టనున్నారు. సందర్శకులను ప్రత్యేకంగా అలరించేందుకు ఈసారి తందూరి చాయ్‌ను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫన్‌డే కార్యక్రమానికి వస్తున్న వారందరూ కొవిడ్‌  జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement