శంషాబాద్ బావర్చి హోటల్‌ నిర్వాహకుల వీరంగం

ABN , First Publish Date - 2022-01-19T19:00:09+05:30 IST

శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎస్‌ బావర్చి హోటల్ నిర్వాహకులు వీరంగం సృష్టించారు.

శంషాబాద్ బావర్చి హోటల్‌ నిర్వాహకుల వీరంగం

హైదరాబాద్: శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎస్‌ బావర్చి హోటల్ నిర్వాహకులు వీరంగం సృష్టించారు. తనిఖీలకు వెళ్లిన స్మైల్ టీం అధికారులపై  హోటల్ సిబ్బంది దాడికి పాల్పడ్డారు. హోటల్‌లో పలువురు బాలకార్మికులతో పని చేయిస్తున్నారంటూ సమాచారం రావడంతో తనిఖీలకు వెళ్లిన అధికారులపై బూతులు తిడుతూ దాడికి యత్నించారు. స్మైల్ టీం అధికారులు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని హోటల్ నిర్వాహకులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-01-19T19:00:09+05:30 IST