Advertisement
Advertisement
Abn logo
Advertisement
Aug 28 2021 @ 17:13PM

Hyderabad: MBS జ్యువెలర్స్‌పై ఈడీ చర్యలు

హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రముఖ నగల వ్యాపార సంస్థ ఎంబీఎస్ జ్యువెలర్స్‌పై ఈడీ చర్యలు తీసుకుంది. ఎంబీఎస్ జ్యువెల్లరీస్ కేసులో ఆస్తులను తాత్కాలికంగా ఈడీ జప్తు చేసింది. ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎంటీసీని మోసం చేసిన కేసులో ఆస్తులను అటాచ్ చేసింది. రూ.363కోట్ల విలువైన స్థిరాస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఎంబీఎస్ జ్యువెలరీస్, ఎంబీఎస్ ఇంపెక్స్ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆస్తులను, అలాగే సుఖేష్‌గుప్తా, అనురాగ్‌గుప్తా, నీతూగుప్తా, వందనగుప్తా ఆస్తులను అటాచ్ చేసింది. బంగారం కొనుగోళ్ల పేరిట ఎంఎంటీసీకి రూ.504 కోట్ల నష్టం చేసినట్లు ఈడీ అభియోగాలు నమోదు చేసింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించినందుకు మరో రూ.222 కోట్ల జరిమానాను విధించింది. విచారణలో నిందితులు సహకరించడం లేదని ఈడీ వెల్లడించింది. 


Advertisement
Advertisement