హైదరాబాద్‌ టూ మంగళగిరి

ABN , First Publish Date - 2020-05-28T11:46:30+05:30 IST

లాక్‌డౌన్‌తో హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన ఏపీ సచివాలయ ఉద్యోగులు రెండు నెలల తర్వాత బుధవారం మంగళగిరికి

హైదరాబాద్‌ టూ మంగళగిరి

  •  ఏపీకి చేరుకున్న సచివాలయ ఉద్యోగులు
  • పది బస్సుల్లో వచ్చిన 227 మందికి కరోనా పరీక్షలు

మంగళగిరి, మే 27: లాక్‌డౌన్‌తో హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన ఏపీ సచివాలయ ఉద్యోగులు రెండు నెలల తర్వాత బుధవారం మంగళగిరికి చేరుకున్నారు.  రవాణా సదుపాయం లేక 65 రోజులుగా హైదరాబాద్‌లోనే ఉండిపోయారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ ఆంక్షలు కొంతవరకు సడలించడంతో సచివాలయ ఉద్యోగులు విధులకు హాజరు కావాలని ఏపీ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశించారు. ఈ క్రమంలో  హైదరాబాద్‌లో ఉండిపోయిన ఉద్యోగులు ఏపీకి వచ్చేందుకు అనుమతి ఇవ్వాలన్న సీఎస్‌ లేఖకు తెలంగాణ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. దీంతో ఏపీ ఆర్టీసీ నుంచి పది ప్రత్యేక బస్సుల్లో   227 మంది సచివాలయ ఉద్యోగులను మంగళగిరి సీకే కన్వెన్షన్‌కు తరలించారు. వీరికి ముందస్తుగా డిప్యూటీ డీఎంహెచ్‌వో పద్మావతి, నూతక్కి పీహెచ్‌సీ వైద్యాధికారి శైలజ పర్యవేక్షణలో పది వైద్య బృందాలు కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహించాయి. మంగళగిరి తహసీల్దారు రామ్‌ప్రసాద్‌ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Updated Date - 2020-05-28T11:46:30+05:30 IST