ఆఫీస్‌ లీజ్‌లో హైదరాబాద్‌ టాప్‌

ABN , First Publish Date - 2021-10-22T09:07:51+05:30 IST

దేశంలో జూలై-సెప్టెంబరు త్రైమాసికంలో ఆఫీ స్‌ స్థలాల లీజింగ్‌కు డిమాండ్‌ భారీగా పెరిగింది. హైదరాబాద్‌ దేశంలోని 6 ప్రధాన నగరాల్లో అగ్రస్థానంలో నిలిచింది.

ఆఫీస్‌ లీజ్‌లో హైదరాబాద్‌ టాప్‌

న్యూఢిల్లీ: దేశంలో జూలై-సెప్టెంబరు త్రైమాసికంలో ఆఫీ స్‌ స్థలాల లీజింగ్‌కు డిమాండ్‌ భారీగా పెరిగింది. హైదరాబాద్‌ దేశంలోని 6 ప్రధాన నగరాల్లో అగ్రస్థానంలో నిలిచింది. కరోనా 2.0 ఉదృతి కారణంగా కార్పొరేట్లు, కోవర్కింగ్‌ అపరేటర్ల నుంచి డిమాండ్‌ పెరగడంతో ఆరు నగరాల్లో లీజింగ్‌ 34 శాతం పెరిగి 1.03 కోట్ల చదరపు అడుగులకు చేరింది. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంతో పోల్చితే ఇది 89 శాతం పెరిగిం ది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో తీసుకున్న లీజు విస్తీర్ణం 77 లక్షల చదరపు అడుగులేనని కోలియెర్స్‌ తెలిపింది. ఆఫీస్‌ స్పేస్‌ డిమాండ్‌లో బెంగళూరును కూడా అధిగమించిన హైదరాబాద్‌లో పలు సంస్థలు 25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో కూడిన స్థలాన్ని లీజుకి తీసుకున్నాయి. 21 లక్షల చదరపు అడుగులతో బెంగళూరు రెండో స్థానంలో ఉంది. 

Updated Date - 2021-10-22T09:07:51+05:30 IST