హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఇంటికే కూరగాయలు

ABN , First Publish Date - 2020-03-27T12:59:19+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రస్తుతం ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఇంటికే కూరగాయలు

హైదరాబాద్ : కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రస్తుతం ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో కూరగాయల ధరలు బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తుండటంతో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే రైతుబజార్‌లకు జనం క్యూ కడుతున్నారు. అక్కడ జనం రద్దీని తగ్గించేందుకు కూకట్‌పల్లి రైతుబజార్‌ ఆధ్వర్యంలో మొబైల్‌ వ్యాన్ల ద్వారా ఇంటి ముంగిటకే కూరగాయలను తెచ్చి విక్రయించేందుకు అన్ని ఏర్పాట్లూ చేశామని రైతుబజార్‌ ఎస్టేట్‌ ఆఫీసర్‌ కందిమళ్ల సుధాకర్‌రావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.


శుక్రవారం మధ్యాహ్నం 12గంటల నుంచి హైదర్‌నగర్‌ రామ్‌నరే‌ష్‌నగర్‌, చందానగర్‌ శాంతినగర్‌, కూకట్‌పల్లి రామాలయం, మాదాపూర్‌ ఆదిత్యానగర్‌, వెంకటేశ్వరనగర్‌ పీజేఆర్‌ కాలనీ, మదీనాగూడ వేముకుంట, సాయంత్రం 3 గంటల నుంచి హైదర్‌నగర్‌ నందమూరి నగర్‌, చందానగర్‌ హుడా కాలనీ, కూకట్‌పల్లి రావూస్‌ స్కూల్‌, మాదాపూర్‌ కృష్ణకాలనీ, శేరిలింగంపల్లి పాపిరెడ్డినగర్‌, మదీనాగూడ జవహర్‌నగర్‌ ప్రాంతా ల్లో మొబైల్‌ వ్యాన్ల ద్వారా తాజా కూరగాయలు, ఆకుకూరలను విక్రయిస్తామన్నారు. మరిన్ని వివరాలకు 7330733752లో సంప్రదించవచ్చన్నారు. 

Updated Date - 2020-03-27T12:59:19+05:30 IST