Advertisement
Advertisement
Abn logo
Advertisement

హైదరాబాద్ కేంద్రంగా హెచ్-1 బీ వీసా స్కామ్

హైదరాబాద్: అమెరికాలో హెచ్-1 బీ వీసాలకు సంబంధించి మరో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఇండియాలోని హైదరాబాద్ కేంద్రంగా హెచ్-1 బీ వీసా స్కామ్ జరిగినట్లు అధికారులు గుర్తించారు. 'బెంచ్ అండ్ స్విచ్' తరహా మోసానికి టెక్ కంపెనీ పాల్పడిందని అధికారులు కనుగొన్నారు.  టెక్సాస్‌లోని హూస్టన్ కోర్టులో తాము చేసిన నేరాన్ని క్లౌడ్‌జెన్ కంపెనీ అంగీకరించింది.


థర్డ్ పార్టీ కోసం పని ఉందంటూ భారత్ నుంచి ఉద్యోగులకు బోగస్ కాంట్రాక్టులు, హెచ్‌-1బీ వీసాల జారీ చేసినట్లు క్లౌడ్‌జెన్ కంపెనీ పేర్కొంది. ఉద్యోగుల నుంచి 2013 నుంచి 2020 వరకు కమీషన్ల రూపంలో 5 లక్షల డాలర్లను క్లౌడ్‌జెన్‌ వసూలు చేసింది. వర్జీనియా, రొమేనియా దేశాలతో పాటు హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో క్లౌడ్‌జెన్‌కు కార్యాలయాలు ఉన్నాయి. 

Advertisement
Advertisement