బిడ్డ పుట్టిందని తెలిసినా.. భారత్‌కు వచ్చేందుకు సంకోచించాడు..ఇంతలో జరిగిందో దారుణం..

ABN , First Publish Date - 2021-10-24T00:38:37+05:30 IST

: బిడ్డ పుట్టిందని తెలిసినా కరోనా ఆంక్షలకు భయపడి ప్రయాణం వాయిదా వేసుకున్న ఓ ప్రవాసీ భారతీయుడు తన బుజ్జాయి బోసి నవ్వులు చూడకుండా అసువులు బాసాడు.

బిడ్డ పుట్టిందని తెలిసినా.. భారత్‌కు వచ్చేందుకు సంకోచించాడు..ఇంతలో జరిగిందో దారుణం..

ఇంటర్నెట్ డెస్క్: బిడ్డ పుట్టిందని తెలిసినా కరోనా ఆంక్షలకు భయపడి ప్రయాణం వాయిదా వేసుకున్న ఓ ప్రవాసీ భారతీయుడు తన బుజ్జాయి బోసి నవ్వులు చూడకుండా అసువులు బాశాడు. కేవలం 31 ఏళ్ల వయసులో అతడు హార్ట్‌ఎటాక్‌తో చనిపోయాడు. దీంతో..  అతడి కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. అతడి మరణంతో పాటూ ఆ కుటుంబం కలలు, ఆశలు అన్నీ కనుమరుగైపోయాయి. 


హైదరాబాద్‌కు చెందిన వహీద్ వృత్తి రీత్యా మెకానికల్ ఇంజినీర్. దుబాయ్‌లో ఓ ప్రముఖ కంపెనీలో ఎలక్ట్రికల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతడి కుటుంబం ముషీరాబాద్‌లో ఉంటోంది. అతడికి వివాహమైంది. ఇటీవలేే.. వహీద్ భార్య అతడిని చూసేందుకు సౌదీకి వెళ్లొచ్చింది. కరోనా కారణంగా ఆమె తిరిగి రావడం కొంత ఆలస్యమైనప్పటికీ చివరికి సురక్షితంగానే భారత్‌కు చేరుకుంది. ఇటీవల ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తను తండ్రయ్యాడన్న విషయం తెలుసుకున్న వహీద్ సంబరపడిపోయాడు. తమ కుటుంబం పరిపూర్ణమైందని సంతోషించాడు. అయితే.. విదేశీయులకు సంబంధించి సౌదీ ప్రభుత్వం కరోనా ఆంక్షలు అమలు చేస్తుండటంతో అతడు తన ప్రయాణాన్ని కొంత కాలం వాయిదా వేసుకున్నాడు. కరోనా అనిశ్చితిలో భారత్‌కు వస్తే తిరిగి సౌదీకి వెళ్లలేనన్నది అతడి భయం. 


అయితే.. ఇటీవల అక్కడి ప్రభుత్వం కరోనా టీకా తీసుకున్న విదేశీయుల విషయంలో ఆంక్షలు సడలించడంతో అతడి సంకోచాలన్నీ తొలగిపోయాయి. భారత్‌కు ప్రయాణం పెట్టుకున్నాడు. బిడ్డను ఎప్పుడెప్పుడు చూస్తానా అనుకుంటూ ఉంటున్న సమయంలో ఓ దారుణం జరిగిపోయింది. విమానం ఎక్కడానికి కొద్ది గంటల వహీద్ హార్ట్‌ ఎటాక్ రావడంతో అతడు మరణించాడు. చివరికి..తెలంగాణా ఎన్నారై ఫోరం సభ్యులు రియాద్‌లోనే అతడి అంత్యక్రియలను నిర్వహించారు.

Updated Date - 2021-10-24T00:38:37+05:30 IST