Advertisement
Advertisement
Abn logo
Advertisement

హైదరాబాదీ బిదారీ పరాటా

కావలసిన పదార్థాలు: మైదా- కప్పు, గోధుమ పిండి- ముప్పావు కప్పు, రవ్వ- అర కప్పు, ఉప్పు, నెయ్యి, నీళ్లు - తగినంత. 


తయారుచేసే విధానం: మైదా, రవ్వ, గోధుమపిండిలో ఉప్పు, నీళ్లు వేసి చపాతీ పిండిలా కలుపుకుని పావుగంట మూతపెట్టాలి. ఆ తరవాత పిండిని చిన్న ముద్దలుగా విభజించు కోవాలి. ఒక్కో ముద్దని గుండ్రంగా చిన్న రొట్టెలా వత్తాలి. దీని మీద స్పూను నెయ్యిని రాసి రెండు కొనలూ కలుపుతూ చుట్టుకోవాలి.. ఈ చుట్టని ఓసారి పిండిలో అద్ది పూరీలా వత్తాలి. దీన్ని బాణలిమీద రెండు వైపులా నెయ్యి వేస్తూ ఎర్రగా కాలిస్తే హైదరాబాదీ బిదారీ పరాటా తయారు. మొత్తం ముద్దలన్నీ ఇలాగే వత్తుకొని కాల్చాలి.

డ్రై ఫ్రూట్‌ పనీర్‌ పరోటాపచ్చి బొప్పాయి రొట్టెసజ్జ రొట్టెపుదీనా పరోటాకీటో రోటీఉలవల పరోటాపాలకొల్లు దిబ్బరొట్టిఉల్లితో జొన్నరొట్టె (వీడియో) దాల్‌ పరోటామేథీ పరోటా
Advertisement