కరోనా వ్యాపించకుండా హైడ్రోక్లోరైడ్‌ స్ర్పే

ABN , First Publish Date - 2020-04-03T09:05:51+05:30 IST

కొవిడ్‌-19 కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉట్నూర్‌ పట్టణ ంలోని మేజర్‌ గ్రామ పంచాయతీ అధికారులు గురువారం హైడ్రోక్లోరైడ్‌ను స్ర్పే చేశారు. ఆర్డీవో వినోద్‌కుమార్‌ ఆ

కరోనా వ్యాపించకుండా హైడ్రోక్లోరైడ్‌ స్ర్పే

ఉట్నూర్‌, ఏప్రిల్‌2: కొవిడ్‌-19 కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉట్నూర్‌ పట్టణ ంలోని మేజర్‌ గ్రామ పంచాయతీ అధికారులు గురువారం హైడ్రోక్లోరైడ్‌ను స్ర్పే చేశారు. ఆర్డీవో వినోద్‌కుమార్‌ ఆధ్వర్యంలో స్థానిక అగ్నిమాపక శాఖ అధికారులు అగ్నిమాపక శకఠాన్ని ఉపయోగించి పలు వీధుఓ్ల హైడ్రోక్లోరైడ్‌ను పిచికారీ చేశారు. సింగిల్‌విండో చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, ఇన్‌చార్జీ ఈవో ఉప్పుల సత్యనారాయణ పాల్గొని పట్టణంలోని అన్ని వీధుల్లో హైడ్రోక్లోరైడ్‌ ద్రావనాన్ని స్ర్పే చేయించారు. ఈ సందర్భంగా ఆర్డీవో వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ లాక్‌డౌన్‌ ప్రకటించి ప్రజలందరూ ఇళ్లలో ఉండి కరోనావైరస్‌ ప్రబలకుండా జాగ్రత్త పడాలని ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. ఏజెన్సీలోని అన్ని జీపీల్లో పంచాయతీ అధికారుల ఆధ్వర్యంలో గ్రామాల్లో పారిశుధ్య చర్యలు చేపట్టి కరోనావైరస్‌ ప్రబలకుండా స్ర్పే చేయాలని ఆదేశించారు. ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్లకు పరిమితమైతేనే వైరస్‌ ప్రబలకుండా ఉంటుందని అ న్నారు. ఆయనవెంట ఇన్‌చార్జి ఫైర్‌ఆఫీసర్‌ రాజలింగు ఉన్నారు.


చెక్‌పోస్టుల తనిఖీ

పోలీసు, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను ఆర్డీవో వినో ద్‌ కుమార్‌ తనిఖీ చేశారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయం, ఎన్టీఆర్‌చౌక్‌, అంబేద్కర్‌ చౌరస్తా, పాత బస్టాండ్‌, రామాలయం చౌక్‌, లింగోజీ తండా ఎక్స్‌రోడ్డుల వద్ద ఉన్న చెక్‌పోస్టులను తనిఖీ చేసి ఎవరి వాహనాలనూ అనుమతించొద్దని ఆదేశించారు. అ త్యవసరమని బయటకు వెళ్లిన కారులో ఇద్దరు మాత్రమే ఉండాలని, లేదంటే వాహ నాన్ని ఆపేయాలని అన్నారు. బైకుపై ఇద్దరు వెళ్తే సీజ్‌ చేయాలని సూచించారు.

Updated Date - 2020-04-03T09:05:51+05:30 IST