‘హైడ్రాక్సీ’పై ట్రయల్స్‌ పునః ప్రారంభిస్తాం

ABN , First Publish Date - 2020-06-04T08:38:44+05:30 IST

కరోనా చికిత్సకు మలేరియా నిరోధక ఔషధం హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ పనికొస్తుందా? రాదా? అనేది తేల్చేందుకు ప్రయోగ పరీక్షలను తిరిగి ప్రారంభిస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించింది...

‘హైడ్రాక్సీ’పై ట్రయల్స్‌ పునః ప్రారంభిస్తాం

  • డబ్ల్యూహెచ్‌వో


జెనీవా/న్యూఢిల్లీ, జూన్‌ 3: కరోనా చికిత్సకు మలేరియా నిరోధక ఔషధం హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ పనికొస్తుందా? రాదా? అనేది తేల్చేందుకు ప్రయోగ పరీక్షలను తిరిగి ప్రారంభిస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించింది. ఆ ఔషధంతో ట్రయల్స్‌ను ఆపడానికి సరైన కారణమేదీ కనిపించలేదని డాటా సేఫ్టీ మానిటరింగ్‌ బోర్డు నివేదిక ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈవిషయాన్ని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ ఘెబ్రెయెసుస్‌ వెల్లడించారు. ఆరోగ్య భద్రతా కారణాలను సాకుగా చూపుతూ ‘హైడ్రాక్సీ’తో ప్రయోగ పరీక్షలను తాత్కాలికం గా నిలిపివేస్తున్నామని మే 25న డబ్ల్యూహెచ్‌వో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయానికి ‘లాన్సెట్‌’ మెడికల్‌ జర్నల్‌లో మే 22న ప్రచురితమైన ఓ అధ్యయన నివేదికే కారణమని భావిస్తున్నారు. ఆ నివేదిక ప్రామాణికతపై ప్రశ్నలు వెల్లువెత్తడంతో.. ‘హైడ్రాక్సీ’ పనితీరుపై ప్రచురించిన నివేదికలో సవరణలు చేసినట్లు ‘లాన్సెట్‌’ మే 30న ప్రకటించింది. ఇది జరిగిన నాలుగోరోజే హైడ్రాక్సీ ట్రయల్స్‌పై డబ్ల్యూహెచ్‌వో సానుకూలంగా స్పందించింది.


Updated Date - 2020-06-04T08:38:44+05:30 IST