ఎల్జీ ప్రమాదంపై నేడు ప్రజాప్రతినిధులతో హైపవర్ కమిటీ భేటీ

ABN , First Publish Date - 2020-06-07T17:26:25+05:30 IST

ఎల్జీ పాలిమర్స్‌పై విచారణ జరుపుతున్న హైపవర్ కమిటీ..

ఎల్జీ ప్రమాదంపై నేడు ప్రజాప్రతినిధులతో హైపవర్ కమిటీ భేటీ

విశాఖ: ఎల్జీ పాలిమర్స్‌పై విచారణ జరుపుతున్న హైపవర్ కమిటీ ఆదివారం విశాఖ నగరంలోని ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కమిటీ సమావేశం కానుంది. విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో మే 7వ తేదీన సంభవించిన స్లైరిన్ లీకేజీకి బాధ్యులు ఎవరన్న అంశంపై విచారణ జరుపుతున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శి ఆధ్వర్యంలోని హైపర్ కమిటీ శనివారం విశాఖలోని ఓ హోటల్లో సమావేశమైంది. 


ప్రమాదానికి దారితీసిన అంశాలపై సాంకేతిక కమిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికను కమిటీ అధ్యయనం చేసింది. పరిశ్రమలోని ట్యాంకులు, యంత్రాల్లోని లోపాలు, ఉద్యోగుల నిర్లక్ష్యం ఉన్నతస్థాయిలో పర్యవేక్షణ లోపం, ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోలేకపోవడం, ఉద్యోగుల్లో నైపుణ్యం కొరత, ప్రమాదం అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై అవగాహనారాహిత్యం తదితర అంశాలపై కమిటీ సభ్యులు చర్చించారు.

Updated Date - 2020-06-07T17:26:25+05:30 IST