ప్రభుత్వ ఆస్పత్రుల్లో హైసియా ఐసీయూ బెడ్లు

ABN , First Publish Date - 2021-05-14T09:06:13+05:30 IST

కొవిడ్‌ మహమ్మారి బారినపడిన రోగులకు తన వంతు సాయం చేసే లక్ష్యంతో తెలంగాణలోని ప్రభుత్వ ఆస్పత్రులకు వైద్య పరికరాలు, వైద్య సిబ్బంది మద్దతును అందించడానికి హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోయేషన్‌

ప్రభుత్వ ఆస్పత్రుల్లో హైసియా ఐసీయూ బెడ్లు

25 దవాఖానాల్లో పడకలు, పరికరాలు

హైసియా అధ్యక్షుడు భరణి వెల్లడి


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కొవిడ్‌ మహమ్మారి బారినపడిన రోగులకు తన వంతు సాయం చేసే లక్ష్యంతో తెలంగాణలోని ప్రభుత్వ ఆస్పత్రులకు వైద్య పరికరాలు, వైద్య సిబ్బంది మద్దతును అందించడానికి హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోయేషన్‌ (హైసియా) ముందుకు వచ్చింది. రాష్ట్రంలోని 25 జిల్లా ఆస్పత్రుల్లో ఒక్కో దవాఖానాలో పది ఐసీయూ పడకలను, అందుకు అవసరమైన పరికరాలను సమకూర్చతామని హైసియా అధ్యక్షుడు భరణి అరోల్‌ తె లిపారు. హైదరాబాద్‌లో తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రిసెర్చ్‌ (టిమ్స్‌), కొండాపూర్‌ జిల్లా ఆస్పత్రి, సరోజినీ దేవీ కంటి ఆస్పత్రుల్లో ఐసీ యూ వార్డులను ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. ఇందు కోసం నిర్మాణ్‌ స్వచ్ఛంద సేవా సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని, హోమ్‌ ఐసొలేష న్‌, హైజీన్‌ కిట్లు, వంట సరుకును అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది తక్కువగా ఉన్నందున మూడు నెలల పాటు నర్సులు, వైద్య స హాయకులను నిర్మాణ్‌ సంస్థ ద్వారా నియమిస్తున్నామ ని వివరించారు. గత ఏడాది కొవిడ్‌ విజృంభించినప్పు డు టై, ఇతర సంస్థలతో కలిసి రూ.70 కోట్లు సమీకరించి సాయం చేశామని చెప్పారు. ప్రస్తుతం జిల్లా ఆస్పత్రుల్లో ఐసీయూ బెడ్లను ఏర్పాటు చేయడానికి, ఇతర సాయం అందించేందుకు గత మూడు వారాల్లో 35 కంపెనీలు రూ.13 కోట్లను హైసియాకు అందించాయని తెలిపారు. కనీసం మరో రూ.10 కోట్లను వివిధ కంపెనీలు అందించగలవని హైసియా సీఓఓ శ్రీనివాస్‌ తెలిపారు.

Updated Date - 2021-05-14T09:06:13+05:30 IST