హ్యుండయ్‌ అల్కాజర్‌ బుకింగ్స్‌ షురూ..

ABN , First Publish Date - 2021-06-10T09:06:10+05:30 IST

హ్యుండయ్‌ మోటార్‌ ఇండియా (హెచ్‌ఎంఐఎల్‌).. సరికొత్త స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికల్‌ (ఎస్‌యూవీ) అల్కాజర్‌ బుకింగ్స్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది.

హ్యుండయ్‌ అల్కాజర్‌ బుకింగ్స్‌ షురూ..

హ్యుండయ్‌ మోటార్‌ ఇండియా (హెచ్‌ఎంఐఎల్‌).. సరికొత్త స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికల్‌ (ఎస్‌యూవీ) అల్కాజర్‌ బుకింగ్స్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ నెలలోనే మార్కెట్లోకి దీన్ని విడుదల చేయాలని కంపెనీ భావిస్తోంది. ఈ ప్రీమియం ఎస్‌యూవీని 6,7 సీటర్‌ ఆప్షన్లతో తీసుకువస్తోంది.


దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీ డీలర్‌షిప్స్‌ లేదా ఆన్‌లైన్‌ ద్వారా రూ.25,000 చెల్లించి అల్కాజ ర్‌ను బుక్‌ చేసుకోవచ్చని హ్యుండయ్‌ తెలిపింది. 2 లీటర్‌ పెట్రోల్‌ ఇంజన్‌, 1.5 లీటర్‌ డీజిల్‌ ఇంజన్‌, సిక్స్‌ స్పీడ్‌ ఆటోమేటిక్‌, మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్స్‌ ఆప్షన్లతో ఈ ఎస్‌యూవీ అందుబాటులో ఉండనుంది. సెవెన్‌ సీటర్‌ విభాగంలో ఇప్పటికే ఉన్న మహీంద్రా ఎక్స్‌యూవీ 500, టాటా సఫారీ, ఎంజీ హెక్టర్‌ ప్లస్‌కు అల్కాజర్‌ గట్టి పోటీనిస్తుందని భావిస్తున్నారు. 

Updated Date - 2021-06-10T09:06:10+05:30 IST