రాయల్ బెంగాల్ టైగర్‌ను : మమత ప్రకటన

ABN , First Publish Date - 2021-04-11T20:02:33+05:30 IST

ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల్లో తాము ఓడిపోతామని బీజేపీకి బాగా తెలుసని, అందుకే తుపాకులను ఉపయోగిస్తున్నారని

రాయల్ బెంగాల్ టైగర్‌ను  : మమత ప్రకటన

కోల్‌కతా : ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల్లో తాము ఓడిపోతామని బీజేపీకి బాగా తెలుసని, అందుకే తుపాకులను ఉపయోగిస్తున్నారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. బుల్లెట్ల ప్రతీకారాన్ని బ్యాలెట్‌తో కచ్చితంగా తీర్చుకుంటామని దీదీ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె జలపాయ్‌గురి ప్రాంతంలో పర్యటించారు. కాల్పులు జరిగిన కోచ్‌బిహార్ జరిగిన ప్రాంతానికి తాను వెళ్లకుండా బీజేపీ అడ్డుకట్ట వేస్తోందని ఆరోపించారు. ‘‘నేను రాయల్ బెంగాల్ టైగర్‌ను. కోచ్‌బిహార్‌కు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. అయినా నేను బాధిత కుటుంబాలతో వీడియో కాన్ఫరెన్స్‌తో మాట్లాడాను ’’ అని దీదీ పేర్కొన్నారు. మరోవైపు కోచ్‌బిహార్‌లో జరిగిన కాల్పుల్ని ఆమె మారణహోమంగా అభివర్ణించారు. సీఐఎస్‌ఎఫ్ బలగాలకు ప్రజల్ని అదుపు చేసే పద్ధతిని నేర్పించరని, ఫైర్ స్ర్పే లాగ కాల్పులు జరిపారని దుయ్యబట్టారు. కొందరికి ఛాతి, మెడ భాగాల్లో బుల్లెట్లు దిగాయని మండిపడ్డారు. కాల్పులు జరిగిన ప్రాంతానికి వెళ్లకుండా 72 గంటల పాటు నిషేధం విధించారని మమత మండిపడ్డారు. 

Updated Date - 2021-04-11T20:02:33+05:30 IST