నేను హీరోను కాదు: పవన్

ABN , First Publish Date - 2021-09-29T22:32:54+05:30 IST

తాను హీరోను కాదని, నటుడు అవ్వాలని తనకు కోరిక లేదని పలు సందర్భాల్లో చెప్పానని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు.

నేను హీరోను కాదు: పవన్

అమరావతి: తాను హీరోను కాదని, నటుడు అవ్వాలని తనకు కోరిక లేదని పలు సందర్భాల్లో చెప్పానని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. బుధవారం జనసేన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాటి మనిషికి అన్యాయం జరిగితే స్పందించే గుణం తనకుందని తెలిపారు. సినిమా అంటే ఇష్టమే అయినా గత్యంతరం లేక వచ్చా.. కానీ రాజకీయాల్లో బాధ్యతగా ఇష్టంగా వచ్చానని ప్రకటించారు. రాజకీయాల్లో కలుపు మొక్కలను ఏరివేయాలని వచ్చానని స్పష్టం చేశారు. తనకు ఏదో మెడల్ ఇస్తారనో తాను చేయనని పవన్ చెప్పారు.


‘‘నేను ఎప్పుడు ఏం అడిగినా ఏపీ గురించే అడుగుతా. టీడీపీకైనా బీజేపీకైనా ఏపీ కోసమే మద్దతు ఇచ్చా. కాట్ల కుక్కల్లా అరుస్తారేంటి.. మాట్లాడటం రాదా మీకు?. ఓ పని చేయండి.. ఇళ్లలోకి వచ్చి బంగారం కూడా లాగేసుకోండి. నేను అడుగుతున్నది ఒకరి కష్టార్జితాన్ని మీరెవరు దోచుకోవడానికి అని అడిగా. నేను సినిమా టికెట్ల గురించి అడిగా నాకేమైనా థియేటర్లు ఉన్నాయా? వైసీపీ వారికే ఉన్నాయి. మహానుభావులకు తల వంచుతాం. మీలాంటి వారి తాట తీస్తాం. ఏదైనా అంటే అరుస్తారు.. మాట్లాడరు. ఏపీలో అభివృద్ధి లేదు. ఒక్క రోడ్డయినా వేశారా?’’ అని పవన్ ప్రశ్నించారు.

Updated Date - 2021-09-29T22:32:54+05:30 IST