Abn logo
Aug 13 2021 @ 18:01PM

నేను రాజకీయ వేత్తను కాదు: గల్లా రామచంద్రనాయుడు

చిత్తూరు: పీసీబీ ఆరోపణలపై నేనెలాంటి వ్యాఖ్యలు చేయనని, ఆ విషయం కోర్టు పరిధిలో ఉందని అమరరాజా గ్రూప్‌ వ్యవస్థాపక అధ్యక్షులు గల్లా రామచంద్రనాయుడు తెలిపారు. తమ ప్లాంట్లన్నీ గామాల్లోనే ఏర్పాటు చేశామని, వ్యవసాయ భూములను వాడలేదని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో ప్లాంట్లకు కోటానుకోట్లు పెట్టుబడులు పెట్టామని, ప్రస్తుతం 20 మిలియన్‌ బ్యాటరీలను ఉత్పాదన చేస్తున్నామని ఆయన వివరించారు. ఉద్యోగులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. జిల్లాను, గ్రామాన్ని అభివృద్ధి పరచాలన్న లక్ష్యంతో ముందుకు వచ్చామన్నారు. పరిస్థితులను బట్టి ఎలా ముందుకు వెళ్లాలన్నదానిపై నిర్ణయం తీసుకుంటామని రామచంద్రనాయుడు ప్రకటించారు. దేశవ్యాప్తంగా 16 మ్యానుఫ్యాక్చరింగ్‌ ప్లాంట్లలో ఉత్పాదన కొనసాగుతోందన్నారు. తాను రాజకీయ వేత్తను కాదని, సామాజిక సేవకు మాత్రమే ప్రాధాన్యతనిస్తానని గల్లా రామచంద్రనాయుడు వివరించారు.