Abn logo
Apr 18 2021 @ 00:00AM

చెన్నై ఆస్పత్రిలో లేను!

 పుకార్లకు వివేక్‌ ఒబెరాయ్‌ చెక్‌


అభిమానులకు హిందీ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ వివరణ ఇచ్చారు. తన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లకు ఆయన చెక్‌ పెట్టారు. తమిళ నటుడు వివేక్‌ మరణం తర్వాత చెన్నై ఆస్పత్రిలో వివేక్‌ ఒబెరాయ్‌ చికిత్స పొందుతున్నారని ప్రచారం జరిగింది. దానిపై ఆయన స్పందించారు. ‘‘నేను ఆరోగ్యంగా ఉన్నాను. ముంబైలో నా కుటుంబంతో కలిసి ఉన్నాను. చెన్నైలో ఆస్పత్రి పాలయ్యానని తప్పుడు ప్రచారం జరుగుతోంది. దాంతో వివరణ ఇస్తున్నా. నా ఆరోగ్యం పట్ల అభిమానులు ఆందోళన చెందవద్దు’’ అని వివేక్‌ ఒబెరాయ్‌ పేర్కొన్నారు. తమిళ నటుడు వివేక్‌ మరణం తనను ఎంతో బాధించిందని తెలియజేశారు. వివేక్‌ కుటుంబానికి సంతాపం వ్యక్తం చేశారు.