Abn logo
Jul 7 2020 @ 23:21PM

పవన్ కళ్యాణ్‌తో డేట్‌కు రెడీ అంటున్న వర్మ భామ

ఈ లాక్‌డౌన్‌లో వర్మ పుణ్యమా అని వెలుగులోకి వచ్చిన ‘నగ్నం’ ఫేమ్ శ్రీరాపాక వరసబెట్టి యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు దంచుతుంది. ఒక్కో ఇంటర్వ్యూలో ఒక్కో విషయాన్ని హైలెట్ చేస్తున్న శ్రీరాపాక.. ఇటీవల బాలయ్య గురించి సంచలన విషయాలు బయటపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసింది. టార్గెట్ అనగానే ఆయనని తిట్టేసిందని మాత్రం అనుకోకండి. పవన్ కల్యాణ్ అంటే క్రష్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు అతనితో డేటింగ్‌కి కూడా రెడీ అంటుంది.


ఆమె మాట్లాడుతూ.. ‘‘నాకు తెలుగు సినిమా హీరోల్లో పవన్ కల్యాణ్ అంటే క్రష్. అప్పట్లో ఆయనను కలవాలని రెండు మూడు సార్లు ట్రై చేశాను కూడా. కానీ కుదరలేదు. ఇక ప్రయత్నం చేయలేదు. ఆయనని కలవడం కోసం ఎవ్వరినీ అడగడం నాకు ఇష్టం లేదు. అందుకే ఎవరినీ అడగలేదు. మనసులో ఒక్కటే అనుకున్నా. ఆయనని కలవాలని ఉంటే ఖచ్చితంగా ఎప్పటికైనా కలుస్తాను అని. ఆయనంటే ఎంత ఇష్టం అంటే.. ఆయనతో డేటింగ్‌కు వెళ్లడానికి కూడా రెడీ. ఆయన పిలిస్తే అస్సలు ఆలోచించను. ఆయనతో కలిసి ఒక్క సినిమాలోనైనా నటించాలని ఉంది..’’ అని శ్రీరాపాక (స్వీటీ) తెలిపింది. మరి నిజంగా పవన్ అంటే ఇష్టమో.. లేదంటే ఇది కూడా వర్మ స్కెచ్చో ఆ పైవాడికే తెలియాలి.

Advertisement
Advertisement
Advertisement