ప్రమాణానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా?

ABN , First Publish Date - 2021-06-19T06:42:48+05:30 IST

మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థాన ధర్మకర్తలు, ఈవో మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది.

ప్రమాణానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా?
చెర్వుగట్టులో ఈవోతో వాదనకు దిగుతున్న ఓ ధర్మకర్త

ఈవో, ధర్మకర్తల మధ్య వాగ్వాదం
నార్కట్‌పల్లి, జూన్‌ 18:
మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థాన ధర్మకర్తలు, ఈవో మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. దేవస్థానానికి చెందిన సర్వే నెంబర్‌ 91,92,162లోని మొత్తం 6.25ఎకరాల వ్యవసాయ భూమి కౌలుకు సంబంధించి శుక్రవారం పార్వతీ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన బహిరంగ వేలం కార్యక్రమం ఇందుకు వేదికైంది. ఆలయ నిర్వహణ, అభివృద్ధి పనులను ఉటంకిస్తూ ధర్మకర్తలతో పాటు వేలానికి హాజరైన ఎంపీటీసీ మేకల రాజిరెడ్డి సైతం ఈవో పనితీరుపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ధర్మకర్తల వి మర్శలకు ధీటుగా ఈవో సమాధానం చెప్పే క్రమంలో దేవాలయ ంలో పరస్పరం ప్రమాణం చేద్దామనే వరకు పరిస్థితులు వెళ్లాయి. సర్వే నెంబర్‌ 3,4,282,283లోని మొత్తం 9ఎకరాల వ్యవసాయ భూమి కౌలు హక్కును వేలంలో దక్కించుకున్న రైతు జలంధర్‌రెడ్డికి భూమిని ఎందుకు స్వాధీనం చేయలేదని ధర్మకర్తలు ప్రశ్నించారు. పాత టెండర్‌దారు భూమిని స్వాధీనం చేయడం లేదంటూ తాజా టెండర్‌దారుడు వచ్చి ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోలేదంటూ ధర్మకర్తలు ఈవోను నిలదీశారు. ఈ ఫిర్యాదుపై విచారించి తదుపరి చర్యలకు నివేదిక ఇవ్వాల్సిందిగా ఆలయ ఇనచార్జి సూపరింటెండెంట్‌తో పాటు సంబంధిత సెక్షన్‌ ఉద్యోగికి చెప్పానని ఈవో ఇచ్చిన సమాధానంపై ధర్మకర్తలు సంతృప్తి చెందలేదు. టోల్‌గేట్‌ కాంట్రాక్టర్‌కు వాహనాల నిలుపుదల కోసం కేటాయించిన స్థలాన్ని సైతం కౌలుకు ఇచ్చే విషయంలో ఇటు ధర్మకర్తలు అటు ఈవో మధ్య వాద ప్రతివాదనలు చోటుచేసుకుని గంభీర వా తావరణాన్ని సృష్టించడంతో చూస్తుండిపోవడం సిబ్బంది వంతైం ది. ఐతే ఇటు ధర్మకర్తలు అటు ఈవో ఇరువురూ తమ వాదనలపై పట్టుదలకు పోవడంతో పరిణామాలు ఎటు దారితీస్తాయోనన్న ఆందోళన సిబ్బందిలో నెలకొంది. కార్యక్రమంలో ధర్మకర్తలు మారపాకల ప్రభాకర్‌రెడ్డి, పసునూరు శ్రీనివాస్‌, రాధారపు భిక్షం, బూర్గు కృష్ణయ్య, కొండేటి వేణు, చిక్కుళ్ల యాదగిరి, బొబ్బలి దేవేందర్‌, మేక వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.


Updated Date - 2021-06-19T06:42:48+05:30 IST