హైడ్రాక్సీక్లోరోక్వీన్ వాడుతున్నాను: బ్రెజిల్ అధ్యక్షుడు

ABN , First Publish Date - 2020-07-08T21:34:56+05:30 IST

కరోనా విషయంలో బ్రెజిల్ అత్యంత ప్రమాదకర స్థితిలో ఉంది. అమెరికా తర్వాత అత్యధిక కేసులు బ్రెజిల్‌లోనే ఉన్నాయి. ఇప్పటి వరకు 16 లక్షలకు పైగా కేసులు బ్రెజిల్‌లో నమోదు అయ్యాయి. మరణాల్లో కూడా బ్రెజిల్ అమెరికా

హైడ్రాక్సీక్లోరోక్వీన్ వాడుతున్నాను: బ్రెజిల్ అధ్యక్షుడు

బ్రెజిలియా: తాను హైడ్రాక్సీక్లోరోక్వీన్ మందులు వాడుతున్నట్లు కరోనాతో ఇబ్బంది పడుతున్న బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సోనారో తెలిపారు. ఆ మందులతోనే తాను కోలుకుంటున్నానని, ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని పేర్కొన్నారు. ‘‘డాక్టర్లు నాకు హైడ్రాక్సీక్లోరోక్వీన్, అజిత్రోమైసిన్ మందులు ఇస్తున్నారు. వీటితో పాటు నేను మానసికంగా ధైర్యంగా ఉన్నాను. ఇప్పుడు నా ఆరోగ్యం బాగానే ఉంది’’ అని చెప్పుకొచ్చారు. అయితే హైడ్రాక్సీక్లోరోక్వీన్‌పై వచ్చే వదంతులను నమ్మవద్దని అన్న బొల్సోనారో.. ఆ మందు వాడుతూ కోలుకుంటున్న వ్యక్తుల్లో తాను మరొక వ్యక్తినని అన్నారు.


కరోనా విషయంలో బ్రెజిల్ అత్యంత ప్రమాదకర స్థితిలో ఉంది. అమెరికా తర్వాత అత్యధిక కేసులు బ్రెజిల్‌లోనే ఉన్నాయి. ఇప్పటి వరకు 16 లక్షలకు పైగా కేసులు బ్రెజిల్‌లో నమోదు అయ్యాయి. మరణాల్లో కూడా బ్రెజిల్ అమెరికా తర్వాతే ఉంది. ఇప్పటి వరకు 66,868 బ్రెజిలియన్లు కరోనా వల్ల మరణించారు.

Updated Date - 2020-07-08T21:34:56+05:30 IST