ఆకుపచ్చని లోగిళ్ళ కోసం సీఎం కెసిఆర్ కృషి

ABN , First Publish Date - 2021-08-03T21:49:24+05:30 IST

తెలంగాణలో హరితహారం కార్యక్రమాన్ని స్పూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ప్రచారం చేస్తున్న జర్నలిస్ట్ పొన్నాల గౌరీశంకర్ రాష్ట్ర వ్యాప్తంగా సాగే ప్రజా హరిత హారం సైకిల్ యాత్రను

ఆకుపచ్చని లోగిళ్ళ కోసం సీఎం కెసిఆర్ కృషి

హైదరాబాద్: తెలంగాణలో హరితహారం కార్యక్రమాన్ని స్పూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ప్రచారం చేస్తున్న జర్నలిస్ట్ పొన్నాల గౌరీశంకర్ రాష్ట్ర వ్యాప్తంగా సాగే ప్రజా హరిత హారం సైకిల్ యాత్రను మాసాబ్ ట్యాంక్ లోని సమాచార పౌర సంబంధాల శాఖ  కార్యాలయం నుంచి  ప్రారంభించారు. ఆ శాఖ అదనపు సంచాలకులు నాగయ్య కాంబ్లే ఈ ర్యాలీని ప్రారంభించారు. నింగి, నీరు, నేల కాలుష్యమైన చోట ప్రాణి మనుగడ ప్రశ్న్తార్దకమౌతుంది.ఊపిరి నిచ్చేది, ఆయువు పెంచేది, ఔషధాన్నిచ్చేది వృక్షం (చెట్టు). కాబట్టి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం అలవాటుగా చేసుకోవాలని ఈ సందర్భంగా నాగయ్య పిలుపునిచ్చారు. 


మనషి మనుగడకు ఆదేరువు (చెట్టు) వృక్షాన్ని, ప్రకృతి సంపదపై ప్రజలు చిన్న చూపును ప్రదర్శిస్తున్నారు. పలితంగా తెలంగాణ రాష్ట్రంలో చెట్ల శాతం గణనీయంగా తగ్గింది. ఇలాంటి పరిస్థతుల్లో...భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని సీఎం కెసిఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం "హరితహారం" కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.  పల్లె పల్లెను, పట్టణాలను పచ్చని చల్లని వణంలా మారుస్తున్నదని అన్నారు.సైకిల్ ర్యాలీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ప్రజా హారితహారం సైకిల్ యాత్రను నిర్వహిస్తున్న సీనియర్ జర్నలిస్టు స్వామి పొన్నాల గౌరీశంకర్ ను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్ తో పాటు పలువురు అధికారులు ఉద్యోగులు సిబ్బంది అభినందించారు.

Updated Date - 2021-08-03T21:49:24+05:30 IST