Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘దిల్బర్-దిల్బర్’ పాటకు ఆ కుర్రాడి నడుము తిప్పుడు చూస్తే.. నోరా ఫతేహీ కూడా నోరెళ్ల బెట్టాల్సిందే.. వైరల్ వీడియో!

ఎంతో ఆదరణ పొందిన బాలీవుడ్ సాంగ్ ‘దిల్బర్- దిల్బర్’ ఇప్పుడు మరోమారు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. అయితే ఇప్పుడు ఈ పాటకు ఒక ఏడో క్లాసు కుర్రాడు తన అద్భుతమైన డాన్స్‌తో ఇరగదీశాడు. భవిష్యత్‌లో బెల్లీ డాన్సర్ కావాలనుకుంటున్నట్లు చెబుతున్న ఈ కుర్రాడు హాట్ టాపిక్‌గా మారాడు. ఈ పాట ఒరిజిల్‌లో నోరా ఫతేహీ నడుము తిప్పినట్లే ఈ కుర్రాడు కూడా తన నడుమును తెగ తిప్పుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.

తాను టీవీలో ఈ పాట డ్యాన్స్ చూస్తూ నేర్చుకున్నానని 12 ఏళ్ల వివేక్ చతుర్వేది చెప్పాడు. ఈ కుర్రాడు ఛత్తీస్‌గఢ్‌లోని మర్వాహీ జిల్లాలోని సర్ఖేరా ప్రాంతంలో ఉంటున్నాడు. ఈ కుర్రాడు చేసిన డాన్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ తాను డాన్స్‌ను తన కెరియర్‌గా మార్చుకోవాలనుకుంటున్నానని అన్నాడు. తాను డాన్స్‌లో ఎక్కడా శిక్షణ తీసుకోలేదని తెలిపాడు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement