మోదీ, అరాచకం ఓడిపోయాయి: ఆర్జేడీ అధినేత లాలూ

ABN , First Publish Date - 2021-11-24T23:28:29+05:30 IST

గతేడాది తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలపై రైతులు గత నవంబర్ నుంచి నిరవధిక ఆందోళన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు నెలల తరబడి ఆందోళన చేస్తున్నారు. అయితే రైతు సంఘాలతో పలుమార్లు కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింది..

మోదీ, అరాచకం ఓడిపోయాయి: ఆర్జేడీ అధినేత లాలూ

పాట్నా: ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆయన అరాచకం రెండూ ఓడిపోయాయని రాష్ట్రీయ జనతా దళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాల ఉపసంహరణతో మోదీ ప్రభుత్వంపై విజయం సాధించిన రైతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు. అయితే ఈ పోరాటం చట్టాలను అధికారికంగా రద్దు చేసి, కనీస మద్దతు ధరపై చట్టం వచ్చే వరకు కొనసాగాలని పిలుపునిచ్చారు. ప్రబుత్వం వెంటనే కనీస మద్దతు ధరపై చట్టం చేయాలని లాలూ డిమాండ్ చేశారు.


గతేడాది తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలపై రైతులు గత నవంబర్ నుంచి నిరవధిక ఆందోళన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు నెలల తరబడి ఆందోళన చేస్తున్నారు. అయితే రైతు సంఘాలతో పలుమార్లు కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింది. ఈ ఏడాది జనవరి 26న ఎర్రకోట వద్ద జరిగిన హింసాత్మక ఘటనలతో రైతు ఆందోళన సంకటంలో పడుతుందనే వాదనలు వినిపించాయి. అయితే, రైతులు ఎంత మాత్రం వెనకడుగు వేయకపోవడంతో కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. నవంబర్ 19న దేశ ప్రజలను ఉద్దేశించిన ప్రసంగించిన ప్రధాని మోదీ, రైతులకు క్షమాపణలు చెప్పి సాగు చట్టాల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

Updated Date - 2021-11-24T23:28:29+05:30 IST