Oct 17 2021 @ 18:17PM

వజ్రాలు బహుమతిగా ఇస్తే నేను స్వీకరించను : సుస్మితా సేన్

మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్ వజ్రాల గురించి తన అభిప్రాయం చెప్పింది. ఇంకా పెళ్లి చేసుకోని ఈ సీనియర్ బ్యూటీ, రోహ్మన్‌తో, సహజీవనం చేస్తోంది. అయితే, తన బాయ్‌ఫ్రెండ్‌ని సైతం ఎప్పుడూ డైమండ్స్ గిఫ్ట్‌గా ఇవ్వనీయదట. అతనే కాదు, సుస్మితా స్నిహేతుల్లో ఎవ్వరూ ఆమెకి వజ్రాలు బహుమతిగా ఇవ్వటానికి వీల్లేదట. అటువంటి నియమం ఎప్పుడో పెట్టేసిందట. 


‘‘నా స్నేహితులెవరు నాకు వజ్రాల్ని బహుమతిగా ఇచ్చినా, నేను ఒప్పుకోను. స్వయంగా నేనే డైమండ్స్ కొంటూ ఉంటాను. నాకు... నేనే వాట్ని బహుమతిగా ఇచ్చుకుంటాను!’’ అని సుస్మిత ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. తానే కాదు, స్త్రీలు ఎవరైనా తమ కోసం తాము వజ్రాలు కొనాలంటోంది, ఈ టాలెంటెడ్ బ్యూటీ. ఖరీదైన మణుల్ని తమకు తాము బహుమతిగా ఇచ్చుకుంటే చాలా గొప్పగా ఉంటుందని మిస్ సేన్ అభిప్రాయపడింది. 

Bollywoodమరిన్ని...