ఆశాజనకంగా చర్చలు.. మరో రెండ్రోజుల్లో పరిష్కారం: తోమర్

ABN , First Publish Date - 2021-01-21T02:04:34+05:30 IST

రైతు ప్రతినిధులతో తాము జరిపిన చర్చల్లో పురోగతి కనిపించిందని, సరైన మార్గంలో చర్చలు ..

ఆశాజనకంగా చర్చలు.. మరో రెండ్రోజుల్లో పరిష్కారం: తోమర్

న్యూఢిల్లీ: రైతు ప్రతినిధులతో తాము జరిపిన చర్చల్లో పురోగతి కనిపించిందని, సరైన మార్గంలో చర్చలు నడుస్తున్నాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన జరుపుతున్న రైతు ప్రతినిధులతో బుధవారంనాడు 10వ విడత చర్చలు జరిపిన అనంతరం తోమర్ మీడియాతో మాట్లాడుతూ, ఈనెల 22వ తేదీ నాటికి ఒక పరిష్కారం కుదిరే అవకాశం ఉందని చెప్పారు. ఏడాది లేదా ఏడాదిన్నర పాటు చట్టాల అమలును నిలిపి ఉంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తాము తెలియజేశామని, రైతు సంఘాలు కూడా చాలా సీరియస్‌గానే ఈ విషయాన్ని తీసుకుని, గురువారంనాడు చర్చించి తమ సమాధానాన్ని ఈనెల 22న తెలియజేస్తామని చెప్పారని మంత్రి తెలిపారు. కాగా, ఈనెల 22న మరోసారి సమావేశం కావాలని ఇవాళ జరిగిన చర్చల్లో కేంద్రం, రైతు ప్రతినిధులు నిర్ణయించారు.

Updated Date - 2021-01-21T02:04:34+05:30 IST