‘‘సెకండ్ వేవ్ నడుస్తోంది.. ఇళ్లకు చేరుకోండి’’

ABN , First Publish Date - 2021-04-10T23:36:37+05:30 IST

నూతన సాగు చట్టాల్లో ఇబ్బంది ఉన్న అంశాలపై చర్చించేందుకు కేంద్రం సిద్ధంగానే ఉందని

‘‘సెకండ్ వేవ్ నడుస్తోంది.. ఇళ్లకు చేరుకోండి’’

న్యూఢిల్లీ : నూతన సాగు చట్టాల్లో ఇబ్బంది ఉన్న అంశాలపై చర్చించేందుకు కేంద్రం సిద్ధంగానే ఉందని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పునరుద్ఘాటించారు. ఈ విషయాన్ని తాము రైతు సంఘాలకు అనేక సార్లు చెప్పామని, అభ్యంతరం ఉన్న వాటిని మార్చేందుకు కూడా సిద్ధమేనని ప్రకటించారు. అయినా సరే, తమ ప్రతిపాదనపై రైతు సంఘాలు స్పందించలేదని, కనీసం ఎందుకు స్పందించడం లేదన్న కారణాలను కూడా తెలుపలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోయినా, సానుకూలంగా లేకపోయినా ఉద్యమాలు చేయాలి కానీ, తాము పంపిన ప్రతిపాదనలకు జవాబు చెప్పకపోవడం బాగోలేదన్నారు. ఏదేమైనా తమ ఉద్యమాన్ని చేయాలన్న ఏకైక లక్ష్యంతో రైతు సంఘలు ప్రవర్తిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా ఉధృతంగా కొనసాగుతోందని, ఈ కారణంగానే ఉద్యమంలో ఉన్న పిల్లలు, వృద్ధులు తమ తమ ఇళ్లకు చేరుకోవాలని చాలాసార్లు విజ్ఞప్తి చేశానని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ సాగుతోంది, రైతులు, రైతు సంఘాల నేతలు కోవిడ్ మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని తోమర్ స్పష్టం చేశారు. 

Updated Date - 2021-04-10T23:36:37+05:30 IST