అండగా ఉంటా పోరాడండి!

ABN , First Publish Date - 2021-07-28T06:34:17+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలతో జనం విసిగిపోయారని, ఈ తరుణంలో ప్రజాసమస్యలపై మరింత పోరాటం చేయాలని నారా లోకేశ్‌ పిలుపునిచ్చారు.

అండగా ఉంటా పోరాడండి!
మురారిలో కొండయ్యదొర విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడుతున్న లోకేశ్‌

టీడీపీ కార్యకర్తలు, నాయకుల జోలికి వస్తే వదిలిపెట్టం

తిరిగి అధికారంలోకి వచ్చాక వైసీపీకి వడ్డీతోసహా బదులిస్తాం

కేడర్‌ ప్రజాసమస్యలపై పోరాడాలని నారా లోకేశ్‌ పిలుపు

జిల్లాలో సుడిగాలి పర్యటన.. ఎక్కడికక్కడ బ్రహ్మరథం

సామర్లకోటలో పొట్టి శ్రీరాములు, ఎన్టీఆర్‌ విగ్రహాల ఆవిష్కరణ

రాజమహేంద్రవరంలో ఆదిరెడ్డి కుటుంబానికి పరామర్శ

మురారిలో కందుల కొండయ్యదొర విగ్రహావిష్కరణ

కాకినాడ (ఆంధ్రజ్యోతి)/ రాజమహేంద్రవరం సిటీ/సామర్లకోట/ పెద్దాపురం/జగ్గంపేట, జూలై 27 : రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలతో జనం విసిగిపోయారని, ఈ తరుణంలో ప్రజాసమస్యలపై మరింత పోరాటం చేయాలని నారా లోకేశ్‌ పిలుపునిచ్చారు. అధికార పార్టీ అరాచకాలు,      అక్రమాలపై ఉమ్మడిగా పోరాడాలని ధైర్యం నూరిపోశారు. కార్యకర్తల కు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని అభయహస్తం అందిం చారు. నాయకులు, కార్యకర్తలపై అక్రమంగా పెడుతున్న కేసులపై టీడీపీ అధికారంలోకి వచ్చాక అంతకుఅంత వడ్డీతో బదులు తీర్చుకుందామని, ఆ బాధ్యత తనదని భరోసా ఇచ్చారు. మంగళవారం జిల్లాలో లోకేశ్‌ సుడిగాలి పర్యటన చేశారు. తొలుత రాజమహేంద్రవరం విమానాశ్రయంలో దిగిన లోకేష్‌ అక్కడి నుంచి పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కుటుంబాన్ని పరామర్శించారు. నాయకులతోను కాసేపు ముచ్చటించారు. అక్కడి నుంచి మధ్యాహ్నాం ఒంటి గం టకు పెద్దాపురం పట్టణానికి చేరుకున్నారు. అక్కడ వందలాది మంది పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయనకు బైక్‌ర్యాలీతో స్వాగతం పలికాయి. అక్కడి నుంచి సామర్లకోటకు చేరుకుని పొట్టి శ్రీరాములు, ఎన్టీఆర్‌ల విగ్రహాలను ఆవిష్కరించారు. పెద్దాపురంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాజా సూరిబాబును, గండేపల్లిలో మాజీ రాష్ట్ర హౌసింగ్‌ బోర్డు డైరెక్టర్‌ కందుల కొండయ్య దొర కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మురారి గ్రామంలో కొండయ్యదొర విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనం తరం పెద్దాపురం పట్టణంలోని ఓ కళ్యాణమండపంలో కార్యకర్తలతో ముచ్చటించారు. ప్రతి ఒక్కరితో సెల్ఫీలు దిగారు. అనంతరం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాజా సూరిబాబును, గండేపల్లిలో మాజీ రాష్ట్ర హౌసింగ్‌ బోర్డు డైరెక్టర్‌ కందుల కొండయ్య దొర కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మురారి గ్రామంలో కొండయ్యదొర విగ్రహాన్ని ఆవిష్కరించారు. సామర్లకోటలో విగ్రహావిష్కరణ అనంతరం బహిరం గ సభలో కార్యకర్తలను ఉద్దేశించి ఉత్సాహంగా ప్రసంగించారు. నమ్మి అధికారం ఇచ్చిన ప్రజలను మాయలఫకీరు జగన్‌ నట్టేట ముంచారని ధ్వజమెత్తారు. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం అని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చే స్తున్న వైసీపీ నేతలు, అధికారులు సంగతి తేలుస్తానని ప్రకటించడంతో కేడర్‌ జైకొట్టారు. ఒక్కసారిగా ఈలలు కేకలతో సంతోషం వ్యక్తంచేశారు. పొట్టి శ్రీరాములు, ఎన్టీఆర్‌ విగ్రహాలను ప్రారంభించడం గర్వంగా ఉందన్నా రు. తెలుగుదేశం భూస్థాపితం అవుతుందంటూ కొందరు అధికారపార్టీ పెద్దలు చెబుతున్నారని.. అసలు టీడీపీని టచ్‌ చేయడం వాళ్లనాయన వల్లే కాలేదని, కొడుకు కూడా వెంట్రుక కాదు కదా గెడ్డం కూడా పీక లేరని కార్యకర్తల కరతాళధ్వనుల మధ్య చెప్పారు. చంద్రబాబు దృష్టిలో తన కుటుంబ సభ్యులంటే పార్టీ కార్యకర్తలేనన్నారు. మీ వెనుక మేముంటామని ప్రజల్ని చైతన్యం చేయాలంటూ కేడర్‌కు పిలుపు నిచ్చారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు జగన్‌ ట్యాక్స్‌ల దెబ్బకుడబుల్‌ సెం చరీ కొడుతున్నాయన్నారు. 25 మంది ఎంపీలను గెలిపిస్తే ఢిల్లీని గడ గడలాడిస్తామన్న జగన్‌ 22 మంది ఎంపీలున్నా డిల్లీ పెద్దలను చూసి వణికిపోతున్నాడన్నారు. పోలవరం నిర్వాసితులకు ఎకరాకు రూ.10 లక్ష లు పరిహారంగా ఇస్తామని చెప్పి ఇప్పుడు వారిని నీట్లో ముంచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అరాచక పాలనపై ప్రతి ఒక్కరూ పోరాడాలని ఎవరూ భయపడొద్దని లోకేశ్‌ పిలుపునిచ్చారు. పెద్దాపురం నియోజక వర్గం అభివృద్ధిలో చినరాజప్ప కృషి ఎంతో ఉందన్నారు. బుచ్చయ్య చౌదరిని ఉద్దేశించి మాబుచ్చయ్య తాత అంటూ నవ్వుల్ని కురిపించారు.



Updated Date - 2021-07-28T06:34:17+05:30 IST