రాహుల్‌ జీ.. మీరు అప్పుడే టీకా తీసుకున్నారంటగా: కేంద్ర మంత్రి

ABN , First Publish Date - 2021-08-02T00:47:06+05:30 IST

శంలో టీకాల కొరత ఉందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించడంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తాజాగా స్పందించారు.

రాహుల్‌ జీ.. మీరు అప్పుడే టీకా తీసుకున్నారంటగా: కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ: దేశంలో టీకాల కొరత ఉందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించడంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తాజాగా స్పందించారు. దేశంలో టీకా కొరత లేదు.. రాహుల్‌లోనే పరిపక్వత లోపించిందని సెటైర్ వేశారు. ‘‘జులై నెలలో 13 కోట్ల టీకా డోసులు వేశాం. ఇలా టీకా డోసు తీసుకున్న వారిలో మీరూ ఉన్నట్టు నేను విన్నాను. కానీ మీరు ఏ రోజూ భారత శాస్త్రవేత్తల కష్టాన్ని ప్రశంసించలేదు. టీకాలు తీసుకోవాలంటూ ప్రజలను ప్రోత్సహించలేదు. వ్యాక్సినేషన్ పేరిట మీరు రాజకీయాలు చేస్తున్నారు.  రాహుల్ జీ.. దేశంలో టీకా కొరత లేదు..మీలోనే పరిపక్వత లోపించింది.’’ అని ఆయన కామెంట్ చేశారు. 

Updated Date - 2021-08-02T00:47:06+05:30 IST