ఓ ఆస్పత్రిలో శవాల కుప్పలు చూశా

ABN , First Publish Date - 2020-09-20T07:43:14+05:30 IST

కరోనా రోగుల నుంచి ప్రైవేటు కార్పొరేట్‌ ఆస్పత్రులు అధిక ఫీజులను బలవంతంగా వసూలు చేస్తున్నాయని టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు ఆరోపించారు.

ఓ ఆస్పత్రిలో శవాల కుప్పలు చూశా

రోగుల రక్షణకు చట్టం చేయాలి

హైదరాబాద్‌ ఆస్పత్రిలో 90 లక్షల బిల్లు వేశారు: కేకే


న్యూఢిల్లీ, సెప్టెంబరు19(ఆంధ్రజ్యోతి): కరోనా రోగుల నుంచి ప్రైవేటు కార్పొరేట్‌ ఆస్పత్రులు అధిక ఫీజులను బలవంతంగా వసూలు చేస్తున్నాయని టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు ఆరోపించారు. సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లోని ఒక ఆస్పత్రిలో ఒక బాధితుడి నుంచి ఏకంగా రూ.90లక్షలు వసూలు చేశారని సభ దృష్టికి తెచ్చారు.


‘‘ఆసుపత్రుల్లో శవాల విషయమే తీసుకోండి. నేనో ఆస్పత్రికి వెళ్లినపుడు అక్కడ శవాలు కుప్పలుగా పడి ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వమో, రాష్ట్ర ప్రభుత్వమో, మరో ఏజెన్సీయో వాటిని చేపట్టే విధంగా యంత్రాంగం ఉండాలి’’ అని సూచించారు. లాక్‌డౌన్‌ సమయంలో కేంద్రం తప్పిదాలను కేకే ప్రస్తావించారు.

వలస కార్మికులకు సొంత ఊరికి వెళ్లేందుకు సమయం ఇవ్వకుండా లాక్‌డౌన్‌ ప్రకటించారని మండిపడ్డారు. రాష్ట్రాలు డీల్‌ చేయాల్సిన అంశాల మీద నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినపుడు రాష్ట్రాలతో మాట్లాడాలని సూచించారు. 


Updated Date - 2020-09-20T07:43:14+05:30 IST