May 14 2021 @ 12:26PM

ఆయనను చూసి ఆశ్చర్యపోయాను: ప్రగ్యా జైస్వాల్

ఆయనను చూసి ఆశ్చర్యపోయాను అంటోంది హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. ఇంతకి ఆయన ఎవరు అంటే నందమూరి బాలకృష్ణ. వివరాల్లోకి వెళితే.. ఈమె బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న 'అఖండ' సినిమాలో బాలయ్య సరసన నటిస్తోంది. ఇందులో అవకాశం వచ్చిందనగానే భయపడిపోయానని తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అందుకు కారణం బాలయ్యకు కోపం ఎక్కువనీ.. సెట్‌లో ఉన్నప్పుడు చాలా సైలెంట్‌గా ఉండాలని కొందరు చెప్పడమేనని తెలిపింది. అయితే వాళ్ళు చెప్పినట్టు కాకుండా సెట్‌లో ఆయన చాలా సరదాగా ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయానని..కూల్‌గా ఉండటంతో ధైర్యంగా నటించానని తెలిపింది ప్రగ్యా. అంతేకాదు నెక్స్ట్ షెడ్యూల్ కోసం ఆతృతగా ఎదురు చూస్తుందట. శ్రీకాంత్ విలన్ పాత్రలో కనిపించబోతున్న ఈ సినిమాను మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. 'అఖండ' టైటిల్ రోర్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారు.