కాంగ్రెస్‌లోనే ఉంటాను: అమరీందర్ సింగ్ భార్య

ABN , First Publish Date - 2021-10-01T22:26:40+05:30 IST

పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కొద్ది రోజులకే కాంగ్రెస్ పార్టీని కూడా వీడుతున్నట్లు ప్రకటించారు కెప్టెన్ అమరీందర్ సింగ్. అయితే ఆయన భార్య మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ నుంచి పటియాలా ఎంపీగా ఉన్న ప్రణీత్ కౌర్‌ కూడా పార్టీ వీడతారా అనే అనే ప్రశ్నలు అనేకం వచ్చాయి..

కాంగ్రెస్‌లోనే ఉంటాను: అమరీందర్ సింగ్ భార్య

చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కొద్ది రోజులకే కాంగ్రెస్ పార్టీని కూడా వీడుతున్నట్లు ప్రకటించారు కెప్టెన్ అమరీందర్ సింగ్. అయితే ఆయన భార్య మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ నుంచి పటియాలా ఎంపీగా ఉన్న ప్రెణీత్ కౌర్‌ కూడా పార్టీ వీడతారా అనే అనే ప్రశ్నలు అనేకం వచ్చాయి. ఈ తరుణంలో ఆమెను కూడా ఈ విషయమై కొంత మంది ప్రశ్నలు వేస్తున్నారట. అయితే తాను కాంగ్రెస్ పార్టీని వీడనని, పార్టీలోనే కొనసాగుతానని శుక్రవారం స్పష్టం చేశారు.


‘‘నేను పార్టీలోనే ఉంటాను. ఇప్పటి వరకు పార్టీలో ఏ స్థానంలో కొనసాగానో అదే స్థానంలో కొనసాగుతాను. పార్టీ వీడాలనే ఆలోచన నాకు లేదు’’ అని ప్రెణీత్ కౌర్ అన్నారు. ప్రణీత్ కౌర్ ప్రాతినిధ్యం వహిస్తున్న పటియాలా లోక్‌సభా నియోజకవర్గంలోనే అమరీందర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న ఈ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ ఏడు స్థానాల్ని గెలుచుకుంది.

Updated Date - 2021-10-01T22:26:40+05:30 IST