కేరళ ప్రజలు వాటిని తిప్పికొట్టాలి: ప్రియాంక గాంధీ

ABN , First Publish Date - 2021-03-30T20:36:08+05:30 IST

తప్పుడు వాగ్దానాలు, అవినీతి ప్రభుత్వం, అధికారం దక్కించుకుని పని చేయకుండా ఉండేవారికి మీరు ఓట్లేయకుండా వారికి కేరళ ప్రజలు బుద్ధి చెప్తారని నేను అనుకుంటున్నాను. ఎన్నికల్లో తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాక

కేరళ ప్రజలు వాటిని తిప్పికొట్టాలి: ప్రియాంక గాంధీ

తిరువనంతపురం: తప్పుడు వాగ్దానాలను, అవినీతిని ఈ ఎన్నికల్లో తిప్పి కొట్టాలని ఓటర్లకు కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ పిలుపునిచ్చారు. మంగళవారం కేరళ రాష్ట్రంలోని కొల్లాం జిల్లా కరునాగపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.


‘‘తప్పుడు వాగ్దానాలు, అవినీతి ప్రభుత్వం, అధికారం దక్కించుకుని పని చేయకుండా ఉండేవారికి మీరు ఓట్లేయకుండా వారికి కేరళ ప్రజలు బుద్ధి చెప్తారని నేను అనుకుంటున్నాను. ఎన్నికల్లో తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాక వాటిని మర్చిపోతున్నారు. అంతే కాకుండా తీవ్రమైన కుంభకోణాలతో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. కోవిడ్ లాంటి మహమ్మారి సమయంలో దేశ ప్రజలకు కనీస రవాణా సౌకర్యం కల్పించలేకపోయారు. అధికారంలోకి వచ్చి ప్రజలకు ఏమీ చేయకుండా ఎలా ఉండగలుగుతున్నారు? ఇలాంటి వారిని ఓడించాలి’’ అని ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు.

Updated Date - 2021-03-30T20:36:08+05:30 IST