బీజేపీని వీడే నేతల లిస్ట్‌లో నేను లేను: యూపీ మంత్రి

ABN , First Publish Date - 2022-01-12T00:15:05+05:30 IST

ప్రసాద్ మౌర్య రాజీనామా అనంతరమే చాలా మంది బీజేపీ నేతలు ఎస్పీ తీర్థం పుచ్చుకోనున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. మౌర్య కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఆ లిస్ట్‌ను ధరమ్ సింగ్‌కి కూడా చూపించారట. ఈ నేపథ్యంలో ధరమ్ సింగ్ కూడా కమల పార్టీని వీడతారా అనే ప్రశ్నలు వచ్చాయి. ఇదే ప్రశ్నను ఆయన వద్ద ప్రస్తావించగా..

బీజేపీని వీడే నేతల లిస్ట్‌లో నేను లేను: యూపీ మంత్రి

లఖ్‌నవూ: మంగళవారం మద్యాహ్నం బీజేపీ నేత, యూపీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య తన పదవికి బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. కాగా, ఈయన బాటలోనే మరికొంత మంది ఎమ్మెల్యేలు పార్టీ వీడనున్నట్లు ఆ పార్టీకి చెందిన నేతలే అంటున్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీకి ఇది ఎలాంటి ప్రభావాన్ని చూపుందనేది చర్చనీయాంశమైంది. బీజేపీని వీడి సమాజ్‌వాదీ పార్టీలో చేరే ఎమ్మెల్యే సంఖ్య మౌర్య వద్ద ఉందని, అయితే ఆ లిస్ట్‌లో తాను లేనని యూపీ మంత్రి ధరమ్ సింగ్ సైనీ అన్నారు.


ప్రసాద్ మౌర్య రాజీనామా అనంతరమే చాలా మంది బీజేపీ నేతలు ఎస్పీ తీర్థం పుచ్చుకోనున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. మౌర్య కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఆ లిస్ట్‌ను ధరమ్ సింగ్‌కి కూడా చూపించారట. ఈ నేపథ్యంలో ధరమ్ సింగ్ కూడా కమల పార్టీని వీడతారా అనే ప్రశ్నలు వచ్చాయి. ఇదే ప్రశ్నను ఆయన వద్ద ప్రస్తావించగా.. ‘‘బీజేపీ నుంచి ఎస్పీలోకి వెళ్లే ఎమ్మెల్యేల జాబితాను స్వామి ప్రసాద్ మౌర్య నాకు చూపించారు. అయితే ఆ జాబితాలో నా పేరు లేదు. నేను బీజేపీలోనే కొనసాగుతాను తప్ప ఏ పార్టీలోకి వెళ్లను’’ అని సమాధానం ఇచ్చారు.

Updated Date - 2022-01-12T00:15:05+05:30 IST